https://oktelugu.com/

Siri Lella: నారా రోహిత్ కి తన కాబోయే భార్య సిరి లెల్ల కి మధ్య ఎంత వయస్సు తేడా ఉందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొనక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఇదంతా పక్కన పెడితే నారా రోహిత్, సిరి లెల్ల కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మధ్య రెండు మూడేళ్ళ వయస్సు గ్యాప్ ఉండడం సర్వసాధారణం.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 03:46 PM IST

    Siri Lella

    Follow us on

    Siri Lella: ప్రముఖ హీరో నారా రోహిత్ నిన్న హైదరాబాద్ లో యంగ్ హీరోయిన్ సిరి లెల్ల తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సోషల్ మీడియా లో నెటిజెన్స్ సిరి లెల్ల గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. కానీ ఆమె గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. ఈమె నారా రోహిత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ప్రతినిధి 2’ లో హీరోయిన్ గా నటించింది. అంతకు మించి ఆమె గురించి ఎలాంటి వివరాలు నెటిజెన్స్ కి దొరకలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమించుకున్నారు. నిన్న అట్టహాసంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం తో పాటు, నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా హాజరైంది. అలాగే ఇండస్ట్రీ నుండి నారా రోహిత్ కి అత్యంత సన్నిహితుడైన శ్రీ విష్ణు వంటి వారు కూడా ఈ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొన్నారు.

    కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొనక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఇదంతా పక్కన పెడితే నారా రోహిత్, సిరి లెల్ల కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మధ్య రెండు మూడేళ్ళ వయస్సు గ్యాప్ ఉండడం సర్వసాధారణం. కానీ నారా రోహిత్, సిరి మధ్య ఎన్నేళ్లు గ్యాప్ ఉందో తెలుసా?, ఏకంగా 12 ఏళ్ళు. నారా రోహిత్ వయస్సు 40 ఏళ్ళు కాగా, సిరి లెల్ల వయస్సు 28 ఏళ్ళు. ఇంత వయస్సు తేడా తో పెళ్లి చేసుకుంటున్న జంట బహుశా సెలెబ్రిటీలలో ఇప్పటి వరకు ఇండియా లో ఎవ్వరూ లేరేమో. ఇంత వయస్సు తేడా ఉంటే, మగవాళ్లకు ఆడ పిల్లని ఏ తండ్రైనా ఇస్తాడా చెప్పండి?, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్లకు అయితే అసలు ఇవ్వరు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన వాడు కాబట్టి, ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో కాబట్టి ముందు వెనుక చూడకుండా సిరి తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేసేసారు.

    ఈ జంట చూసేందుకు ఎంతో క్యూట్ గా అనిపిస్తుంది. డిసెంబర్ నెలలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక నారా రోహిత్ విషయానికి వస్తే విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన చేసిన సినిమాలలో కమర్షియల్ హిట్స్ సాధించినవి చాలా తక్కువే, అయినప్పటికీ కూడా కొత్త తరహా కథలు చేయడంలో ముందు ఉంటాడు అనే పేరు నారా రోహిత్ కి వచ్చింది. ఈయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘సుందరకాండ’ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది.