https://oktelugu.com/

Kalki 2898 AD Release Trailer : బాహుబలి లో కట్టప్పకి కల్కి లో అమితాబ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే..?

Kalki 2898 AD Release Trailer ఇక కట్టప్ప క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ అమితాబచ్చన్ క్యారెక్టర్ లో కనిపించడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 21, 2024 / 10:40 PM IST

    Kattappa in Baahubali and Amitabh in Kalki

    Follow us on

    Kalki 2898 AD Release Trailer : ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ని అమెరికా, యూకే లాంటి కంట్రీలో స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ వాటికి చాలా ఎక్కువ సంఖ్య లో అమ్ముడు పోతున్నాయి. ఇక తెలుగులో మాత్రం ఇంకా ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ని ఓపెన్ చేయలేదు.

    ఇక ప్రభాస్ అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా టికెట్స్ ని తీసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా టికెట్లు ఎప్పుడు అవలేబుల్ లో ఉంచుతారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సినిమాలో అమితాబచ్చన్ భారీ విన్యాసాలను చేస్తూ భారీ ఫైటింగ్ లను కూడా చేస్తున్నాడు.

    ఇక ఇలాంటి క్రమంలో ఈయన క్యారెక్టర్ చూసిన ప్రతి ఒక్కరికి బాహుబలి సినిమాలో కట్టప్ప గుర్తుకొస్తున్నాడు. నిజానికి అమితాబచ్చన్ క్యారెక్టర్ బాహుబలి సినిమాలో కట్టప్పను పోలి ఉంటుంది అని మొదటి నుంచి కూడా వార్తలైతే వస్తున్నాయి. కానీ వాటిని సినిమా యూనిట్ ఎప్పుడు కూడా ఆ విషయం మీద స్పందించలేదు. మరొకసారి ఆ క్యారెక్టర్ ని కనక మనం చూసుకున్నట్లైతే అందులో కట్టప్ప క్యారెక్టర్ ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రభాస్, అమితాబచ్చన్ మధ్యలో ఉండే ఫైట్ సీక్వెన్స్ కూడా బాహుబలి మొదటి పార్ట్ లో ఇంటర్వెల్ సీన్ తలపిస్తుంది.

    ఇక మొత్తానికైతే ఒక ప్రాంతాన్ని రక్షించడానికి రక్షకుడిగా ఉన్న అమితాబచ్చన్ భైరవతో ఎందుకు పోటీపడ్డాడు ఆయనకు ఈయనకు మధ్య శత్రుత్వం ఏంటి అని కొన్ని కీలకమైన అంశాలను మాత్రం సినిమాలో చాలా డీటెయిల్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కట్టప్ప క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ అమితాబచ్చన్ క్యారెక్టర్ లో కనిపించడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలకు సమాధానం తెరకెక్కలంటే ఈనెల 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…