Kalki 2898 AD Release Trailer : భారీ అంచనాల మధ్య ఒక వారం రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ను కనక మనం గమనిస్తే… ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఎక్స్ ట్రా ఆర్డినరీ ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఇక మొదటి ట్రైలర్ తో పోల్చుకుంటే ఈ ట్రైలర్లో చాలావరకు ఎగ్జైట్ మెంట్ అనేది తగ్గింది.
మొదటి ట్రైలర్ విజువల్స్ పరంగా టాప్ నాచ్ లో కట్ చేసిన నాగ్ అశ్విన్ ఈ ట్రైలర్ కు వచ్చేసరికి చాలా డీసెంట్ గా కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మనస్లాంగ్ లో చెప్పాలి అంటే సెకండ్ ట్రైలర్ అనేది చాలా చప్పగా ఉంది. అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ అయితే సరిగ్గా లేదు. ఇక కమలహాసన్ క్యారెక్టర్ ను సరిగ్గా రివిల్ చేయలేదు. కొంతవరకు క్లంజి తో కూడిన ట్రైలర్ నే వదిలారనిపిస్తుంది. ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించినంత సేపు హై వోల్టేజ్ గా అనిపించిన కూడా తన క్యారెక్టర్ లోని ఆర్క్ ను రివిల్ చేయకుండా ఉంచాడు.
ఇక మరో వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసి అంచనాలను తగ్గించాలని చూశారా.? లేదంటే ట్రైలర్ లో చూపించాల్సిది ఇంతే అని చూపించి మిగితా విషయాలను దాచి ఉంచాడా అనేది తెలియడం లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలైతే తారా స్థాయిలో ఉన్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇలాంటి సమయంలో నాగ్ అశ్విన్ కావాలనే ఇలాంటి ట్రైలర్ ను రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే సెకండ్ ట్రైలర్ కోసం విపరీతంగా ఎదురు చూసిన అభిమానులకు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. కానీ వాళ్ళు ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలను ఈ ట్రైలర్ రిచ్ అవ్వలేదు…