Sandeep Reddy Vanga: ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్లు గా గుర్తింపు పొందిన వాళ్లలో తెలుగు నుంచి రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ ముందు వరుసలో ఉన్నారు.తెలుగు సినిమా స్టాండర్డ్ ని పాన్ ఇండియా రేంజ్ లో చాలా అత్యద్భుతంగా ప్రజెంట్ చేశారు నిజానికి వీళ్ళు ముగ్గురు స్టార్ డైరెక్టర్లు అని చెప్పాలి. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో తనదైన రీతిలో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.
దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా మీద కొంత మందు నెగిటివ్ అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ ఈ సినిమా మాత్రం భారీ వసూళ్లను సంపాదించడమే కాకుండా ఒక భారీ హిట్టుగా కూడా మిగిలింది. ఇక ఇలాంటి క్రమంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే రీసెంట్ గా వచ్చిన లియో సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక దాంతో ఇప్పుడు సందీప్ వంగ కి లోకేష్ కనకరాజ్ కి మధ్య మంచి పోటీ ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్ జరుగుతుంది.
ఇక సందీప్ రెడ్డి వంగ మీద లోకేష్ కనకరాజ్ అభిమానులు కొంతవరకు నెగిటివ్ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నప్పటికీ, సందీప్ వంగ అభిమానులు కూడా లోకేష్ కనకరాజ్ మీద నెగిటివ్ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇది చూసిన చాలామంది సినీ పండితులు సైతం వాళ్లు ఇద్దరూ టాప్ డైరెక్టర్లే వాళ్ల గురించి సోషల్ మీడియాలో అంత పెద్ద గొడవ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.
నిజానికి ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన వాళ్లే కాబట్టి ఒకరిది ఒక సినిమా ఒక టైం లో హిట్ అయితే మరొకరిది మరొక టైం లో హిట్ అవుతుంది. ఇప్పుడు హిట్టు సాధించాడని ఆ డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ అవ్వడు అలాగే ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నందువల్ల టాలెంట్ ఉన్న డైరెక్టర్ తక్కువ డైరెక్టర్ అయిపోడు కాబట్టి వాళ్ళిద్దరి గురించి గొడవలు పెట్టుకోకుండా సౌత్ నుంచి నార్త్ హీరోలను సైతం ఇంప్రెస్ చేసేలా సినిమాలు చేస్తున్నందుకు వీళ్లిద్దరూ మన సౌత్ డైరెక్టర్లు అయినందుకు వీళ్లని మనం మెచ్చుకోవాలి అని పలువురు ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు…ఇది మాత్రం నిజం సౌత్ సినిమా స్థాయిని తెలియజేసిన డైరెక్టర్లు గా వీళ్లని మనం కీర్తించాలి…