Mohan Lal-Balayya: జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ పాత్ర కి బాలయ్య కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన శ్రీమంతుడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో మూడో సినిమాగా ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి జనతా గ్యారేజ్ అనే సినిమా చేశాడు.

Written By: Gopi, Updated On : February 9, 2024 2:30 pm
Follow us on

Mohan Lal-Balayya: కొరటాల శివ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో రైటర్ గా ఎంట్రీ ఇచ్చి భద్ర, బృందావనం, మున్నా, ఊసరవెల్లి లాంటి సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. ఇక ఆ తర్వాత ఆయన ప్రభాస్ తో మిర్చి సినిమాను డైరెక్ట్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో తను దర్శకుడిగా ఇండస్ట్రీలో ఒక గొప్ప పేరు సంపాదించుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన శ్రీమంతుడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో మూడో సినిమాగా ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి జనతా గ్యారేజ్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ చేయాల్సిన పాత్ర కోసం మొదట బాలయ్య బాబుని అనుకున్నారంట కానీ, బాలయ్య ఆ క్యారెక్టర్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ తర్వాత మలయాళ నటుడు అయిన మమ్ముట్టిని తీసుకోవాలని అనుకున్నారట, కానీ అప్పుడు ఆయనకి బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఈ క్యారెక్టర్ కి మోహన్ లాల్ ను తీసుకున్నారు.

ఇక ఈ పాత్ర లో మోహన్ లాల్ అద్భుతమైన నటనను కనబరిచి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక సక్సెస్ ను సాధించారు. దాంతో ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటుగా ఎన్టీఆర్ కెరియర్ లోను ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక కొరటాల శివ ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఇక ఇదే కాంబినేషన్ లో ఇప్పుడు దేవర సినిమా కూడా వస్తుంది.ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందంటూ సినిమా యూనిట్ ఇప్పటికే మంచి అంచనాలను పెట్టుకుంది.

ఇక అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఇప్పటికే కండ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఈ ఇయర్ ఏప్రిల్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుందంటూ సినిమా మేకర్స్ అఫీషియల్ గా ఒక డేట్ ని అయితే అనౌన్స్ చేశారు. మరి ఈ తేదీ లోనే సినిమా రిలీజ్ అవుతుందా లేదంటే మళ్లీ ఏదైనా డేట్ ను మార్చే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…