https://oktelugu.com/

Director Shankar-Prabhas: శంకర్, ప్రభాస్ కాంబోలో సినిమా వస్తే అది ఎలా ఉంటుందంటే..?

శంకర్ సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతూ చాలా వండర్స్ చేస్తూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే రజినీ కాంత్ తో చేసిన రోబో సినిమాతో దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి తన సత్తా ఏంటో చూపించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 9, 2024 / 02:42 PM IST
    Follow us on

    Director Shankar-Prabhas: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ తను చేసిన మొదటి సినిమాతోనే అటు తమిళ్, ఇటు తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఆయన చేసిన వరుస సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఇక్కడ కూడా మంచి విజయాలను సాధిస్తూ వచ్చాయి.

    అయితే శంకర్ సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతూ చాలా వండర్స్ చేస్తూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే రజినీ కాంత్ తో చేసిన రోబో సినిమాతో దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి తన సత్తా ఏంటో చూపించాడు. నిజానికి ఈ సినిమాతోనే సౌత్ సినిమా స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరోలకు తెలిసి వచ్చింది. ఇక దాని తర్వాత రాజమౌళి బాహుబలి సినిమా చేసి సౌత్ సినిమాలా స్టామినా ఏంటో చూపించాడు.

    ఇక ఇదిలా ఉంటే శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒక మిస్టరీ గా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమా కి సంబందించిన ఒక్క టీజర్ గానీ, గ్లింప్స్ గానీ వదలలేదు. దాంతో అభిమానుల్లో సినిమా రిలీజ్ పట్ల ఒక క్లారిటీ అయితే రావట్లేదు. దాంతో అభిమానులు ఆ సినిమా మీదగాని, డైరెక్టర్ శంకర్ మీదగాని తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే ప్రభాస్ శంకర్ కాంబినేషన్ లో కనక ఒక సినిమా వచ్చినట్టయితే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అంటు ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ఊహాగానాలు వేసుకుంటున్నారు. నిజానికి ప్రభాస్ లాంటి హీరోతో శంకర్ సినిమా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభాస్ కటౌట్ కి ఆయన మేకింగ్ కి చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే శంకర్ అంటే సినిమాని మామూలు రేంజ్ లో కాకుండా నెక్స్ట్ లెవెల్లో తీస్తాడు అలాగే ప్రభాస్ ను కూడా చాలా కొత్త గా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు కాబట్టి సినిమా అభిమానులు అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఇప్పటివరకైతే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటు రూమర్లైతే వస్తున్నాయి. కానీ అఫీషియల్ గా ఆ సినిమా అనౌన్స్ మెంట్ అయితే జరగలేదు. ఇక ఫ్యూచర్ లో అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి…