https://oktelugu.com/

Chiranjeevi: విమర్శలను ఎలా తీసుకుంటానో చెప్పిన చిరంజీవి…

చిరంజీవి మెగాస్టార్ అయిన తర్వాత ఆయనను చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ వచ్చారు. అయితే ఆ విమర్శలను చిరంజీవి ఎలా తీసుకుంటాడు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతూ ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 9, 2024 2:20 pm
    Chiranjeevi on how to take criticism
    Follow us on

    Chiranjeevi: దాదాపు 40 ఏళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్క హీరో చిరంజీవి. ఈయనను చూసి సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు. ఇక అదే విధంగా చిరంజీవి సక్సెస్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా మన చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినిపించుకోకుండా మనం కష్టపడినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది అని చిరంజీవి చాలా సార్లు చెప్పాడు.

    ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి మెగాస్టార్ అయిన తర్వాత ఆయనను చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ వచ్చారు. అయితే ఆ విమర్శలను చిరంజీవి ఎలా తీసుకుంటాడు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకి ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి సమాధానాన్ని కూడా చెప్పాడు. అది ఏంటి అంటే విమర్శించే వాళ్ళు నేను హ్యాపీగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతోనే వాళ్లు నా మీద విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్లు దూషించే నేను నేను కాదు అని నా మనస్సాక్షి కి తెలుసు. నేనేం చేశాను, ఏం చేయలేదు అనేది నాకు తెలిసినంత గా వెరేవాళ్లకి తెలియదు కదా వాళ్లు నా గురించి ఎన్ని మాటలు అనుకున్న నాకు సంబంధం లేదు.

    వాళ్లు నా సంతోషాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు. దానికి నేనెందుకు బాధపడాలి అనే ఒకే ఒక కారణంతో వాళ్లని పట్టించుకోకుండా నేను ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. అంటు తను కామెంట్లు చేశాడు. నేను ఎలాంటి వాన్నో జనాలకి తెలుసు కాబట్టి నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందువల్ల నేను ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాను. దానివల్ల మనకు మెంటల్ టార్చర్ అనేది తగ్గుతుంది. అలాగే మనం చేసే సినిమాల మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటూ చిరంజీవి చెప్పిన మాటలు చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ వర్డ్స్ అనే చెప్పాలి.

    ఇంకా చిరంజీవి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అనే కాదు ఏ రంగంలో ఉన్న వారైనా సరే మీ గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడిన మిమ్మల్ని విమర్శించిన వాళ్లని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు జీవితం లో సక్సెస్ అవుతారు అంటూ ఒక గొప్ప మాట అయితే చెప్పాడు…