https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కి ఆ లేడీ ఎమ్మెల్యే కి మధ్య సంబంధం ఏంటి..?

అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చాడు. ఇక వీళ్లిద్దరి కాంభినేషన్ లోనే సరైనోడు సినిమా వచ్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : January 10, 2024 / 01:05 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో స్టైల్ ఉంటుంది. వాళ్లు వాళ్ళ స్టైల్ లోనే సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే సంపాదించుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయిన అల్లు అర్జున్ కూడా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఈయన పూరి జగన్నాథ్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఒక హీరోయిన్ గా అమలాపాల్ నటిస్తే, మరొక హీరోయిన్ గా కేథరిన్ నటించింది.

    అయితే ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక దాని తర్వాత అల్లు అర్జున్ రేసుగుర్రం అనే సినిమాతో ఒక సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అప్పటికే చాలా రోజుల నుంచి అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చాడు. ఇక వీళ్లిద్దరి కాంభినేషన్ లోనే సరైనోడు సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తే, మరో హీరోయిన్ గా కేథరిన్ నటించింది.ఇక ఈ సినిమాలో కెథరిన్ ని తీసుకోమని అల్లు అర్జున్ బోయపాటికి చెప్పినట్టు గా చాలా వార్తలు వచ్చాయి.

    అయితే ఆమె సరైనోడు సినిమాలో ఎమ్మెల్యే హన్షిత రెడ్డి క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ కి ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన కేథరిన్ కి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. ఇక అలాగే అల్లు అర్జున్ తన సర్కిల్లో ఉన్న డైరెక్టర్లకి హీరోలకి కెథరిన్ ని తమ సినిమాల్లో తీసుకోవాలని చెప్పాడంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇక అప్పుడే అల్లు అర్జున్ కి కెథరిన్ కి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ చాలా వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలపై వీళ్లిద్దరిలో ఒక్కరూ కూడా స్పందించలేదు.

    ఇక ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడం తో తను ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయింది. ఇక అల్లు అర్జున్ మాత్రం వరుసగా సక్సెస్ లను అందుకుంటూ స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరొకసారి తన లక్కును పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు…