Salaar: సలార్ సినిమా అక్కడ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

ఇప్పటికే 600 కోట్లకు పైన కలక్షన్స్ రాబట్టి తనదైన రీతిలో 1000 కోట్ల కలక్షన్లను దూసుకెళ్ళడానికి రెడీ అవుతుంది అయితే ఈ సినిమా అన్ని ఏరియాల్లో బాగా నడిచినప్పటికీ తమిళనాడు, కర్ణాటక ,కేరళ లో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపించలేక పోతుంది.

Written By: Gopi, Updated On : December 30, 2023 9:00 am

Salaar

Follow us on

Salaar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు తమదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటున్నారు ఇక ఇప్పటికే సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ప్రభాస్ మొత్తానికి అయితే సక్సెస్ బాట పట్టాడు అనేది క్లియర్ గా అందరికీ అర్థం అయిపోయింది. ఇంతకుముందు వరుసగా మూడు సినిమాలతో ఫ్లాపులను మూట కట్టుకున్నాడు ఎట్టకేలకు సలార్ సినిమాతో ఒక సాలిడ్ హిట్ కొట్టి ఇండస్ట్రీకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఇప్పటికే 600 కోట్లకు పైన కలక్షన్స్ రాబట్టి తనదైన రీతిలో 1000 కోట్ల కలక్షన్లను దూసుకెళ్ళడానికి రెడీ అవుతుంది అయితే ఈ సినిమా అన్ని ఏరియాల్లో బాగా నడిచినప్పటికీ తమిళనాడు, కర్ణాటక ,కేరళ లో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపించలేక పోతుంది. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇలాంటి ఒక మాస్ హీరోని ప్రశాంత్ నీల్ మేకింగ్ ని ఆ మూడు ప్రాంతాల ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడడం లేనట్టుగా తెలుస్తుంది. అయితే కర్ణాటకలో ఈ సినిమా మీద ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ ఎందుకు చూపించడం లేదంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మొదటి సినిమాగా వచ్చిన ఉగ్రం సినిమా కి ఈ సినిమా రీమేక్ గా రావడమే మొదటి కారణం అంటూ చెబుతున్నారు.

కానీ ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాకి దీనికి చాలా మార్పులు చేశాడు. కానీ ప్రేక్షకులు మాత్రం దీనిని కంప్లీట్ గా ఉగ్రం సినిమా కి రీమేక్ అనే భావిస్తున్నారు. దానివల్ల ఈ సినిమాని చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. అందుకే అక్కడ కలక్షన్స్ అనేవి చాలా తక్కువగా వచ్చినట్టుగా ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతో బిజీ అవుతుండగా ప్రభాస్ మాత్రం కల్కి సినిమా షూట్ లో పాల్గొనడానికి కసరత్తులు చేస్తున్నాడు. ఇక సలార్ సినిమాతో వచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యం తోనే ప్రశాంత్ నీల్ అలాగే ప్రభాస్ ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వచ్చే కల్కి సినిమాతో కూడా ప్రభాస్ సూపర్ డూపర్ హిట్టుని కొడితే ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా గుర్తింపు పొందుతాడ.ఇక ఇప్పటికే వరుసగా 200 కోట్లకు పైన కలక్షన్స్ ని రాబట్టిన సినిమాల్లో ప్రభాస్ 5 సినిమాలు నిలవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.