https://oktelugu.com/

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ మహేష్ బాబు చేయాల్సిన ఆ హిట్ సినిమాను వేరొక హీరోతో చేయడానికి కారణం ఏంటంటే..?

ఒకప్పుడు బాలీవుడ్ లో అమితాబచ్చన్ ను హీరోగా పెట్టి భారీ సక్సెస్ లను అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ఆయన చేసిన సినిమాలు ఒకప్పుడు మంచి విజయాలను సాధించడమే కాకుండా బాలీవుడ్ ని సైతం ఏలీన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : September 9, 2024 / 10:19 AM IST

    Ram Gopal Varma

    Follow us on

    Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ… అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేశాడు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలన్నీ కూడా ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలవడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ మహేష్ బాబుతో చేయాల్సిన సినిమాను మరొక మీడియం రేంజ్ హీరోతో చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక వివరాల్లోకి వెళితే రామ్ గోపాల్ వర్మ ‘సత్య 2 ‘ సినిమాని ముందుగా మహేష్ బాబు తో చేయాలనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాని మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు. దాంతో శర్వానంద్ ను హీరోగా పెట్టి సత్య 2 సినిమాను చేశాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్మ శర్వానంద్ కు సైతం ఒక డిఫరెంట్ ఇమేజ్ నైతే తీసుకు వచ్చి పెట్టాడు.

    మరి ఇలాంటి క్రమం లో శర్వానంద్ కు సత్య 2 సినిమాతో కంప్లీట్ చేంజ్ ఓవర్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అప్పటి వరకు శర్వానంద్ గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలు చేస్తూ వచ్చాడు ఇది కూడా తనకు ఒక బెస్ట్ అటెంప్ట్ గా మిగిలిపోయిందనే చెప్పాలి. మరి రామ్ గోపాల్ వర్మ ఎందుకు శర్వానంద్ తో సినిమా చేశాడు. మరో స్టార్ హీరోతో సినిమా చేస్తే బాగుండేది కదా! అని ప్రతి ఒక్కరు వాళ్ళ అనుమానాలైతే వ్యక్తం చేశారు.

    కానీ వర్మ మాత్రం మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ స్టోరీ ని రిజెక్ట్ చేయడంతో వేరే ఏ స్టార్ హీరో కూడా దీనికి సెట్ అవ్వడనే ఉద్దేశ్యం తో యంగ్ హీరోతో సినిమా చేస్తే బాగుంటుందని ఈ సినిమా కోసం శర్వానంద్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ జనరేషన్ లో ఉన్న యంగ్ హీరోలందరిలో వర్మ శర్వానంద్, నితిన్ లాంటి హీరోలతో సినిమాలను చేశాడు. ఇక శర్వానంద్ తో చేసిన సత్య 2 సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ ఇటు వర్మ, శర్వానంద్ కి మాత్రం మంచి పేరునైతే తీసుకొచ్చింది.

    కాబట్టి వర్మ చేసే సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన కథలు ఎంపికలో గానీ చాలావరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.ఇక ఇప్పుడైతే బి గ్రేడ్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను హింసిస్తున్న వర్మ ఒకప్పుడు మాత్రం మంచి సినిమాలను చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు…