Rajamouli And Prashant Varma: ప్రస్తుతం సినిమాలను చూసే ప్రేక్షకుడి ఆలోచన మారిపోయింది. రొటీన్ రెగ్యూలర్ కథలకు కాలం చెల్లిపోయింది. ఇక ఎప్పుడు చేయబోయే సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలంటే మాత్రం తమదైన రీతిలో కొత్త కథలను చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. అలా చేయకపోతే మాత్రం సినిమాలకు కాలం చెల్లిపోతుందనే చెప్పాలి. అందుకే కొంతమంది డైరెక్టర్లు రెగ్యూలర్ కథలను కాకుండా గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకొని ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నారు. దీనివల్ల ప్రేక్షకుల్లో ఉండే క్యూరియాసిటీని తారాస్థాయిలోకి తీసుకెళ్లడమే కాకుండా విజువల్ వండర్స్ ని కూడా అందించడంలో దర్శకులు సక్సెస్ ని సాధిస్తున్నారు. అందుకే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఆపర్చునిటీస్ రావడమే కాకుండా భారీ క్రేజ్ కూడా దక్కుతుంది… ఇక ప్రస్తుతం రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేయడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే ఆయనకు భారీ గుర్తింపురావడమే కాకుండా తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో రాజమౌళి ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు.
ఇక ఏది ఏమైనా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి… రాజమౌళి తర్వాత గ్రాఫిక్స్ తో విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయగలిగే స్టామినా ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆయన తక్కువ బడ్జెట్ లోనే భారీ గ్రాఫిక్స్ సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోయే సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటున్నాయి. యంగ్ డైరెక్టర్ గా ముందుకు సాగుతున్న ప్రశాంత్ వర్మ తనదైన రీతిలో సత్తా చాటుకొని స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలతో ముందుకు సాగితే మాత్రం ఆయనకు ఫ్యూచర్ లో కూడా భారీ రెస్పాన్స్ అయితే వస్తుంది.
కాబట్టి మొదటి నుంచే ఆయన అలాంటి పంథాను ఎంచుకొని ముందుకు సాగడం అనేది కూడా ఒక రకంగా మంచి విషయమనే చెప్పాలి… ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి హనుమాన్ సినిమాకి సిగ్గుగా జై హనుమాన్ చేస్తూనే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు…