Canada: భారత్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందో.. కెనడా కూడా అలాగే వ్యవహరిస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్యను అడ్డం పెట్టుకుని భారత్‌ను దోషిగా చూపడంతోపాటు.. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కెనడాలోని భారతీయ ఓటర్ల మద్దతుతో గెలవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్య విషయంలో భారత్‌ను దోషిగా చూపుతోంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోంది. అమెరికాకు లీకులు ఇస్తోంది. భారత ఎదుగుదలను ఓర్వలేని దేశాలు కెనడాను అడ్డం పెట్టుకుని భారత్ స్పీడ్‌కు బ్రేకులు వేయాలని చూస్తున్నాయి. అయితే ఇవీవే నెరవేరవని భారత్ స్పష్టం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతింటున్న తరుణంలో కెనడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కెనడా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
వీసా కష్టాలు..
కెనడా తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపెట్టింది. వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్‌డీఎస్)ను నిలిపివేస్తున్నట్లు కెనడా శుక్రవారం(నవంబర్ 8న) ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ ప్రహసనంగా మారనుంది.
13 దేశాలపై ప్రభావం..
కెనడా ఎస్‌డీఎస్‌ను ఎత్తివేయడం వలన భారత్‌తోపాటు చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం సహా 13 దేశాలపై ప్రభావం పడుతుంది. ఇంతకాలం ఈ దేశాల స్టూడెంట్ వీసాల జారీని కెనడా ఎల్డీఎస్ ద్వారా త్వరగా పరిష్కరించింది. ఈ 13 దేశాల విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కేది. స్టడీ పర్మిట్లు త్వరగా వచ్చేవి. తాజా నిర్ణయంలో సాధారణ స్టడీ పర్మిట్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వీసాల జారీ ఆలస్యం అవుతుంది.
సమర్థించుకున్న కెనడా..
ఇదిలా ఉంటే ఎస్‌డీఎస్ ఎత్తివేత నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబంధం లేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేవంతోనే ఎస్‌డీఎస్‌ను ఎత్తివేసినట్లు తెలిపింది. దీంతో 13 దేశాల విద్యార్థులకు ప్రాధాన్యం తగ్గుతుంది. గతంలో కూడా కెనడా ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల డిపాజిట్ పరిమితిని పెంచింది. తర్వాత ఇళ్ల అద్దెలు పెంచింది. తర్వాత ఉపాధి అవకాశాల్లో కోత విధించింది. తాజాగా ఎస్‌డీఎస్‌ను ఎత్తివేసింది.