Vijayendra Prasad : ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి అసలు పట్టించుకునే వారు కాదు. మన సినిమాలను చూడడానికి వాళ్ళు అసలు ఇష్టపడేవారు కూడా కాదు. మన దర్శకులు వాళ్ళకి కథలు చెప్పాలంటే చాలా సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సిన అవసరం అయితే ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ గానే గుర్తింపు పొందుతుంది. కాబట్టి మన హీరోలు, మన దర్శకులు ఇప్పుడు వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో మన దర్శకులతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే మన హీరోలతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శకులు ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ముందుకు వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మన దర్శకులు మాత్రం తెలుగు హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకు సాగడం విశేషం… ఇక ఇదిలా ఉంటే తెలుగులో స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్న రచయిత విజయేంద్రప్రసాద్…
ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ దగ్గర నుంచి సినిమా కథలను తీసుకోవడానికి బాలీవుడ్ దర్శకులు, హీరోలు పోటీ పడుతున్నారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన ‘భజరంగీ భాయిజాన్ ‘ లాంటి ఒక అల్టిమేట్ సినిమాకి కథ రచయితగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం ఆయన దగ్గర నుంచి ఒక కథను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి దానికి తగ్గట్టుగానే ఆయన కూడా వాళ్ల ఇమేజ్ కి సెట్ అయ్యే అయ్యే కథలను రెడీ చేసి పెట్టుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే విక్రమార్కుడు 2, బజరంగీ భాయిజాన్ 2 లాంటి సినిమా కథలను రెడీ చేసి పెట్టారట. మరికొన్ని సైన్స్ ఫిక్షన్ కథలతో కూడా హై వోల్టేజ్ గ్రాఫికల్ వండర్స్ ని క్రియేట్ చేసే కథలను తన దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అందులో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలకు ఇలాంటి కథలను ఇస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
నిజానికి ఒకప్పుడు విజయేంద్రప్రసాద్ కథలు చెబుతానంటే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి హీరోలు కథలు కూడా వినేవారు కాదు. కానీ ఇప్పుడు తన దగ్గరికే వచ్చి వాళ్లే ఒక మంచి కథను రెడీ చేయమని చెప్పి తను అడిగినంత రెమ్యూనరేషన్ ను ఇచ్చి మరి కథలను రెడీ చేసుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు మన తెలుగు సినిమా స్థాయి అనేది ఏ రేంజ్ కి పెరిగిందో…