OTT : చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకొని కాసుల కనకవర్షం కురిపించిన చిత్రాలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలలో ఒకటి ‘కమిటీ కుర్రాళ్లు’. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తగ్గట్టుగా ఓపెనింగ్స్ అయితే ఈ సినిమా రాబట్టలేకపోయింది కానీ, లాంగ్ రన్ లో మాత్రం మంచి వసూళ్లను దక్కిచుకుంది. కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఆమె ఈ సినిమాని నిర్మించింది. కానీ లాంగ్ రన్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి థియేటర్స్ నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే థియేటర్స్ లో పలు చోట్ల విజయవంతంగా నడుస్తుంది అంటే మామూలు విషయం కాదు. మొదటి సక్సెస్ కోసం ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్న నిహారిక కి కొడితే కుంభస్థలం బద్దలు అయ్యినట్టు అయ్యింది.
కేవలం థియేట్రికల్ నుండే 8 కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించిన నిహారిక ఓటీటీ రైట్స్, సాటిలైట్ రైట్స్ ద్వారా మరింత లాభాలను ఆర్జించింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని భారీ రేట్ కి ఈటీవీ విన్ యాప్ వారు కొనుగోలు చేసారు. ఈ నెల 12 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈటీవీ విన్ యాప్ అభిరుచి చాలా బిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంతముందు మన చిన్నతనం లో జరిగిన సంఘటనలను నెమరువేసుకునేలా ’90s’ అనే వెబ్ సిరీస్ ని స్ట్రీమింగ్ చేసింది ఈటీవీ విన్ యాప్. ఇప్పుడు అదే తరహా కథాంశం తో తెరకెక్కిన ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రాన్ని కూడా స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధం అవ్వడం గమనార్హం. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని దాదాపుగా 15 కోట్ల రూపాయలకు ఈటీవీ విన్ యాప్ సంస్థ కొనుగోలు చేసిందట. థియేట్రికల్ రన్ నుండి 8 కోట్ల రూపాయిల లాభాలు, ఓటీటీ రైట్స్ 15 కోట్లు, సాటిలైట్ రైట్స్ మరో 15 కోట్లు. అలా కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రంతో నిహారిక 38 కోట్ల రూపాయిలు లాభాలు అందుకుంది.
జాక్పాట్ కొట్టడం అంటే ఇదే కదా, సక్సెస్ కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూసిన ఆమెకి ఒకేసారి ఈ రేంజ్ సక్సెస్ దక్కడంతో ఆమె ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇలాంటి వినూతనమైన సబ్జక్ట్స్ తో మరికొన్ని సినిమాలు తీసి తన విజయ పరంపర ని కొనసాగించాలని అనుకుంటుంది నిహారిక. ఈ సినిమాకి ముందు ఆమె పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది. అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం గమనార్హం, నిర్మాతగా నిహారికకు భారీ నష్టాలను కూడా తెచ్చిపెట్టాయి ఆ వెబ్ సిరీస్ లు. ఇప్పుడు ఒకే ఒక్క సక్సెస్ తో ఆమె నష్టపోయిన మొత్తాన్ని వడ్డీతో సహా వసూలు చేసింది నిహారిక.