NTR And Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ లోకి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి…ఆయన చేసిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది.అలాగే పాన్ ఇండియా సినిమా అంటే ఎలా ఉంటుందో ఇండియా మొత్తానికి చూపించిన సినిమా కూడా బాహుబలి అనే చెప్పాలి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలు వరుసగా వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమాలో హీరోగా చేసిన ప్రభాస్ ఒక్కసారి గా ప్రపంచవ్యాప్తంగా భారీ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టి తన రేంజ్ ని భారీగా పెంచుకున్నాడు…
ఇక ఇలాంటి క్రమంలో బాహుబలి 2 సినిమా అయితే ఏకంగా 2000 కోట్ల కలక్షన్స్ రాబట్టి ఇండియాలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా మంచి గుర్తింపును సంపాదించుకుంది…ఇక ఈ సినిమా సెట్ చేసిన బెంచ్ మార్క్ ని క్రాస్ చేసే సినిమా ఇప్పటివరకు అయితే రాలేదు. ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా దాన్ని బ్రేక్ చేయలేదు ఇక దాంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసిన కూడా ప్రభాస్ రికార్డును బ్రేక్ చేయలేదు అంటూ చాలామంది సినీ పండితులు సైతం సోషల్ మీడియా వేదిక చాలా విమర్శలను చేశారు.
అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసిన కూడా ఒక ప్రభాస్ ని అందుకోలేకపోయారు అని ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ ని పొగుడుతూ పోస్ట్ లు పెట్టారు నిజానికి వీళ్ళిద్దరూ కలిసి చేసిన తిబుల్ ఆర్ ఆ సినిమా 2000 కోట్ల పైన కలక్షన్లు రాబట్టాల్సింది. కానీ సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల ఆ సినిమా అనేది భారీ రేంజ్ లో సక్సెస్ సాధించలేదని చాలామంది చెప్తూ ఉంటారు.
మొత్తానికైతే ఇద్దరు స్టార్ హీరోలు కలిసిన కూడా ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్ చేయలేకపోయారు అంటే బాహుబలి 2 తో ప్రభాస్ ఎంతటి ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరి బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేసే సినిమా ఏదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేసి చూడాలి…