RRR Vs KGF 2: త్రిబుల్ ఆర్ కి కెజీఎఫ్ 2 కంటే ఎక్కువ కలక్షన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే..?

త్రిబుల్ ఆర్ ఇద్దరు హీరోలు ఉన్న కూడా 1200 కోట్ల కలక్షన్స్ ని మాత్రమే రాబట్టింది.రాజమౌళి సినిమా అలాగే ఇద్దరు హీరోలు ఉన్న కూడా అంత తక్కువ కలక్షన్స్ ని రాబట్టడం ఏంటి అనేది అప్పట్లో అందరిలో కలిగిన సందేహం.

Written By: Gopi, Updated On : January 2, 2024 4:35 pm

RRR Vs KGF 2

Follow us on

RRR Vs KGF 2: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కిన కెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా కేవలం 1200 కోట్ల కలక్షన్స్ ని మాత్రమే రాబట్టింది. నిజానికి కేజిఎఫ్ సినిమాకి కూడా 1200 కోట్ల కలక్షన్లు వచ్చాయి. అయితే కేజిఎఫ్ సినిమాని 150 కోట్లతో తెరకెక్కిస్తే త్రిబుల్ ఆర్ సినిమాని మాత్రం 300 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ ఎత్తున తెరకెక్కించారు. అయినప్పటికీ ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.

ఇక త్రిబుల్ ఆర్ ఇద్దరు హీరోలు ఉన్న కూడా 1200 కోట్ల కలక్షన్స్ ని మాత్రమే రాబట్టింది.రాజమౌళి సినిమా అలాగే ఇద్దరు హీరోలు ఉన్న కూడా అంత తక్కువ కలక్షన్స్ ని రాబట్టడం ఏంటి అనేది అప్పట్లో అందరిలో కలిగిన సందేహం. నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ క్యారెక్టర్లను చూపించిన విధానం చాలా మందికి నచ్చలేదు.రామ్ చరణ్ క్యారెక్టర్ ని ఎక్కువగా పెట్టేసి, ఎన్టీఆర్ పాత్రని కొంతవరకు తగ్గించాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక సీన్ అయితే మరి ఇల్లాజికల్ గానే అనిపిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ లో రామ్ చరణ్ సీతారామరాజు లాగా గెటప్ వేసుకుని బాణాలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక అదే టైమ్ లో ఎన్టీఆర్ వాటర్ లో దాక్కొని ఉంటాడు.

నిజానికి అడవి నుంచి వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ బాణాలతో యుద్ధం చేయాలి. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు అసలు ఆయన బాణాన్ని కూడా పట్టుకోడు. ఆయన పోలీస్ కాబట్టి గన్స్ తో మాత్రమే కాలుస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ చేత ఫైట్ చేయించడం ఎన్టీఆర్ ని వాటర్ లో దాక్కోబెట్టడం వల్ల జనాలకి ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. ఒకవేళ రామ్ చరణ్ అలా బాణాలు వేసినట్టయితే ఇంతకుముందు సీన్లలో ఎప్పుడైనా తను బాణాలు వేయడం నేర్చుకున్నట్టుగా గాని లేదా ఎన్టీఆర్ క్యారెక్టర్ తనకి బాణాలు వేయడం నేర్పినట్టుగా గానీ చూపించాల్సింది అలా చేయకుండా డైరెక్ట్ గా రామ్ చరణ్ కి అల్లూరి సీతారామరాజు గెటప్ వేసి బాణాలు వేయించడం అనేది చాలామంది అభిమానులకు నచ్చలేదు అందువల్ల ఈ సినిమా చాలా ఇల్లాజికల్ గా ఉందని చాలామందికి రిపిటేడ్ గా ఈ సినిమా ని చూడటానికి ఇష్టపడలేదు.

అయితే రాజమౌళి సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ కూడా రెండు మూడు సార్లు చూడడానికి ఇష్టపడతారు.అందుకే రాజమౌళి సినిమాలకి మిగితా సినిమాల కంటే ఎక్కువ కలక్షన్స్ వస్తాయి కానీ ఈ సినిమా ఒక్కసారి చూస్తేనే చాలు అనేలా ఉండటంతో సెకండ్ టైం చాలా మంది చూడలేకపోయారు. కాబట్టి ఈ సినిమాకి కలెక్షన్స్ అయితే ఎక్కువగా రాలేదు అనేది ట్రేడ్ పండితుల అభిప్రాయం…