Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరియర్ లో డైరెక్టర్ గా చాలా తక్కువ సినిమాలు చేశాడు. ఆయన డైరెక్టర్ గా మారి దాదాపు 20 సంవత్సరాలు గడుస్తున్నా కూడా డైరెక్టర్ గా ఆయన 11 సినిమాలు మాత్రమే చేశాడు. ఇక అందులో ఎక్కువగా మహేష్ బాబు,అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో ఒక సినిమా చేశాడు. ఇలా త్రివిక్రమ్ ఈ నలుగురు స్టార్ హీరోలకు మాత్రమే పరిమితం అవ్వడం పట్ల చాలామంది చాలా రకాల కామెంట్లు తెలియజేస్తున్నారు.
త్రివిక్రమ్ మిగతా స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేయాల్సింది కానీ త్రివిక్రమ్ కి కంఫర్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఈ నలుగురు త్రివిక్రమ్ కి మంచి కంఫర్ట్ గా ఉంటారు కాబట్టి ఆయన సినిమాల్లో ఆయన రాసుకునే క్యారెక్టర్లకి వీళ్ళు సరిగ్గా సరిపోతారు కాబట్టి ఈ నలుగురు హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ తో మూడు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు, మహేష్ బాబు తో గుంటూరు కారం తో కలుపుకొని మూడు సినిమాలు చేశారు.
నిజానికి త్రివిక్రమ్ ఏ హీరోకి కథ చెప్పిన ఆయనతో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ముందుకు వస్తారు కానీ ఈయన మాత్రం అందరి హీరోలతో సినిమాలు చేయడానికి రెడీగా లేనట్టుగా తెలుస్తుంది. అందుకే రిపీటెడ్ హీరోస్ ని పెట్టుకొని సినిమాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తూనే సక్సెస్ లు కొడుతున్నారు ఈయన కెరీర్ కి అలా హీరోల కెరియర్లకి కూడా చాలా ఉపయోగపడుతుంది…
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఆయన సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని కూడా రంజింప చేస్తూ ఉంటాయి. అందుకే ఆయన సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.ఇక చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఆయన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మిగతా డైరెక్టర్లకు తనకి తేడా ఏంటి అంటే తన సినిమాల్లో కామెడీ యాక్షన్ ఫ్యామిలీ అన్ని కలగలిపి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆయన సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు…