Kalki Movie: ప్రస్తుతం పాన్ ఇండియాలో రిలీజ్ అయిన కల్కి సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్ లను బ్రేక్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర చేసిన వ్యక్తి ఫేస్ మనకు సరిగ్గా కనిపించదు. అయితే ఈ క్యారెక్టర్ లో తమిళ నటుడు అయిన కృష్ణ కుమార్ నటించాడనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఎందుకంటే ఆయన తన ఇన్ స్టాగ్రామ్ నుంచి స్వయంగా కల్కి మూవీ లో కృష్ణుడి పాత్ర పోషించినట్టుగా ఒక పోస్ట్ అయితే చేశాడు. అయితే ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలో కృష్ణుడి పాత్ర ఫేస్ ను రివిల్ చేయకపోవడం వెనక అసలైన కారణం ఏంటి అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ ఎన్టీయార్ కి వీరాభిమాని అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ పేరు ను కూడా ఆయన పెట్టాడు. కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఒక్కడే గుర్తొస్తాడు అలాంటి ఆయన్ని యాక్టింగ్ లో గాని, ముఖ తేజస్సులో గానీ ఆయన చాలా బాగుంటారు.
ముఖ్యంగా ఆయన కృష్ణుడి గెటప్ లో ఉన్నప్పుడు శంకం పట్టుకొని ఊదుతున్న ఫోటోను వైజయంతి మూవీస్ బ్యానర్ లోగో గా వాడుకున్నారు. కాబట్టి అలాంటి పెద్దాయన వేసిన కృష్ణుడి క్యారెక్టర్ ని మరొక ఆర్టిస్ట్ తో రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టం. అందుకే ఒక చిన్న ఆర్టిస్ట్ ను పెట్టుకొని అతని ఫేస్ ని కూడా రివిల్ చేయకుండా కృష్ణుడు పాత్రని చేశారు.
ఇక మొత్తానికైతే కృష్ణ కుమార్ కూడా కృష్ణుడి పాత్రలో చాలా మంచి యాక్టింగ్ ను కనబరిచి ప్రేక్షకులందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక అశ్విని దత్ తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ పోషించిన కృష్ణుడి పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…