Aamani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా చిరంజీవికి ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవల్ లో ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకప్పుడు చిరంజీవి సినిమాల స్థాయి ఏంటో మనందరికీ తెలిసిందే…సగటు ప్రేక్షకుడిని మెప్పించడం లో చిరంజీవి సినిమాల తర్వాతే ఎవరి సినిమాలైనా అనేంతలా గుర్తింపును అభిమానుల్లో చెరిగిపోని గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు చిరంజీవి…
అయితే ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క నటుడు చిరంజీవితో నటించాలని,ఆయనతో ఒక సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ కోరుకుంటూ ఉంటాడు. ఇక హీరోయిన్లు అయితే చిరంజీవి పక్కన నటించే అవకాశం వస్తే ఎగిరిగంతేస్తారనే చెప్పాలి. అలా రంభ,రమ్యకృష్ణ, మీనా లాంటి స్టార్ హీరోయిన్లు తనతో చేసిన తర్వాతే ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన గా గుర్తింపు పొందారు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న జగపతిబాబు, శ్రీకాంత్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ఆమని చిరంజీవితో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే, అయితే అప్పట్లో ఆమెకి చిరంజీవితో ఒక సినిమాలో చేసే అవకాశం వచ్చిందట.
కానీ సినిమా ప్రొడ్యూసర్ చిరంజీవి పక్కన ఈమె హీరోయిన్ గా సెట్ అవ్వదు అని తనని రిజెక్ట్ చేసి వేరే హీరోయిన్ ను ఆ సినిమాలో తీసుకున్నారట. ఇక దాంతో తన ఫేవరెట్ హీరో అయిన చిరంజీవి పక్కన నటించే అవకాశం వచ్చిందని సంబరపడిన ఆమని అవకాశం చేజారి పోవడంతో చాలా బాధపడిందట.
ఇక అప్పటినుంచి ఆమెకి మళ్ళీ చిరంజీవి సినిమాలో చేసే అవకాశం అయితే రాలేదు. ఆమెకి ఇండస్ట్రీ పరంగా ఏదైనా లోటు ఉంది అంటే అది చిరంజీవి సినిమాలో చేయకపోవడమే అని ఆమె చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికైతే సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఆమె హీరోలకి హీరోయిన్ లకి మదర్ గా చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక ప్రత్యేకమైన హోదాని సంపాదించుకున్నారనే చెప్పాలి..
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: What is the reason for not doing aamani movie with chiranjeevi