Aaye movie  : ఆయ్ ‘ మూవీ ట్రైలర్ లో కామెడీ ని మాత్రమే హైలెట్ చేయడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పటి వరకు చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు. ఇక ఇప్పుడు నార్నె నితిన్ కూడా అది తరహాలో ముందుకు వెళ్తున్నాడు... ఎన్టీయార్ సపోర్ట్ ఉన్నప్పటికీ నితిన్ మాత్రం ఎన్టీయార్ ను ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా తను ఒక్కడే సోలోగా ముందుకు వెళ్తున్నాడు...

Written By: Gopi, Updated On : August 5, 2024 6:18 pm
Follow us on

Aaye movie : ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరోలు వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ బామ్మర్ది గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నార్నే నితిన్ హీరోగా మారి మంచి సినిమాలనైతే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగా తన మొదటి సినిమాగా వచ్చిన ‘ మ్యాడ్’ మూవీ మంచి విజయాన్ని సాధించగా హీరోగా అతనికి మంచి గుర్తింపు అయితే లభించింది. ఇప్పుడు ఆయన ‘ ఆయ్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తో నార్నె నితిన్ ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ అధ్యంతం కామెడీగా సాగడమే కాకుండా సినిమాలోని కోర్ పాయింట్ ని కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఆకతాయిగా తిరుగుతూ అందరి దృష్టిలో చాలా బ్యాడ్ పర్సన్స్ గా ముద్ర పడతారు.

మరి అలాంటివారు చేసిన కొన్ని పనుల వల్ల ఆ ఊరికి గాని వాళ్లకు గాని ఎలాంటి పేరు వచ్చింది అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో చూపించిన ప్రతి ఎలిమెంట్ కూడా హైలైట్ గానే నిలిచింది. కొన్ని డబల్ మీనింగ్ డైలాగులు ట్రైలర్ లో రివీల్ చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటుందనే విషయమైతే అర్థమవుతుంది. ఇక ఆగస్టు 15వ తేదీన చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలైతే క్రియేట్ అవుతున్నాయి. ఇక ఒక్కసారిగా ట్రైలర్ తోనే ఈ సినిమా మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది.

మొన్నటి దాకా అసలు ఈ సినిమా గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాని చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని సీన్లలో ఎమోషన్ ని హైడ్ చేసి ఓన్లీ కామెడీ ని మాత్రమే చూపిస్తూ సినిమా లోని అసలు పాయింట్ రివిక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక దీనివల్ల కామెడీని ఇష్టపడే ప్రేక్షకుడు కూడా థియేటర్ కి వస్తాడు.

ఇక అలాగే క్లైమాక్స్ లో ఒక ఎమోషన్ తో కూడిన డ్రామాని ప్లే చేసి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకునేలా ఈ క్యారెక్టర్స్ అన్ని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఫైనల్ గా రవితేజ రామ్ లాంటి స్టార్ హీరోలతో పోటీపడి మరి ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కంటెంట్ బేస్డ్ సినిమా కాబట్టి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది…