https://oktelugu.com/

Nani – Allu Arjun : నాని పోస్ట్ పై సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్…అసలేం జరిగిందంటే..?

ఇండస్ట్రీ లో సినిమాలా మధ్య పోటీ అనేది ఉండటం కామన్... నిజానికి మన హీరోల మధ్య ఎలాంటి ఈగోలు లేకుండా ఒకరితో ఒకరు చాలా బాగా మాట్లాడుకుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 5, 2024 / 06:05 PM IST
    Follow us on

    Nani – Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసిన వాళ్ళ అభిమానులు ఆ సినిమాలను చూస్తూ ఆదరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంటుంది… ఇక ఇదిలా ఉంటే నాని హీరోగా గత సంవత్సరంలో వచ్చిన ‘ దసర ‘ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నాని కెరియర్ లోనే మొదటిసారి 100 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా కూడా ఇది మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి రీసెంట్ గా ఏడు ఫిలింఫేర్ అవార్డులు రావడం ఒక విశేషం అనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే ’69వ శోభా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్’ ఫంక్షన్ లో భాగంగా శనివారం రోజున అవార్డుల ప్రధానోత్సవాన్ని హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. ఇక ఇందులో నానికి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఆ అవార్డు అందుకున్న వేళ ఆయన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇక దానికి ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ ‘నువ్వు దీనికి అర్హుడివి’ అంటూ ఒక కామెంట్ అయితే చేశాడు. ఇక దాంతో నాని కూడా దానికి రిప్లై ఇస్తూ ‘పుష్ప 2’ (పుష్ప ది రూల్) సినిమాని ఉద్దేశించి వచ్చే ఏడాది రూల్ చేయబోతున్న మీరు మరెన్నో అవార్డులను ఇంటికి తీసుకెళ్తారని నమ్ముతున్న అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక దానికి అల్లు అర్జున్ కూడా ‘అది నిజమవుతుందని నేను ఆశిస్తున్నా’ అంటూ సమాధానం ఇచ్చాడు…

    ఇక ఇదిలా ఉంటే దసరా సినిమా నాని కెరియర్ లోనే ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. ఆయన ఒక రా క్యారెక్టర్ లో నటించి మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన తనను తాను ఒక స్టార్ హీరోగా క్రియేట్ చేసుకోవడం లో చాలా వరకు సక్సెస్ అయ్యాడు…

    ఇక దసరా సినిమాకు గాను అందులో హీరోయిన్ గా చేసిన కీర్తి సురేష్ కి కూడా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఇంకా దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెలకి కూడా ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కడం విశేషం…ఇక మొత్తానికైతే నాని ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ‘సరిపోదా శనివారం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమాతో మరిన్ని అవార్డులను కూడా సొంతం చేసుకుంటాడని నాని చాలా ధీమాతో ఉన్నాడు.

    మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే విషయాల మీదనే ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి. ‘అష్టచమ్మ ‘ సినిమాతో చిన్న హీరోగా మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి చేరుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో ఆయన స్టార్ హీరోగా కూడా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి…