Pawan Kalyan Shirt Price : సినిమాలు రాజకీయాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే పవన్ కళ్యాణ్ నిన్న బాలయ్య బాబు కోసం ఒక రోజు మొత్తం కేటాయించాడు..ఆహా మీడియా లో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు..సుమారు రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఒక్కసారి కూడా టాక్ షో లో పాల్గొనని పవన్ కళ్యాణ్ బాలయ్య అడగగానే ఈ బిగ్గెస్ట్ టాక్ షో లో పాల్గొనడం చర్చనీయాంశం అయ్యింది.

ఇద్దరు రాజకీయ నేపథ్యం ఉన్న సెలబ్రిటీస్ కావడం తో పాలిటిక్స్ లో కూడా వీళ్లిద్దరి కలయిక సెన్సేషనల్ టాపిక్ గా మారింది..ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ని ఏమి ప్రశ్నలు అడిగి ఉంటాడు అనే దానిపైనే ఎక్కువగా చర్చ నడుస్తుంది..సోషల్ మీడియా ఎంతో కాలం నుండి ప్రచారం అవుతున్న ఎన్నో విషయాలకు ఈ ఎపిసోడ్ ద్వారా సమాధానం దొరకబోతుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ఇక ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ధరించిన హూడీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..సాధారణంగా సెలెబ్రిటీలు ధరించే దుస్తుల కోసం అభిమానులు గూగుల్ లో వెతికి కొనుక్కోవడానికి చూస్తారు..అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ధరించిన దుస్తులు అంటే ఎలా ఎగబడుతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..అలా నిన్న ఆయన ధరించిన హూడీ కోసం అభిమానులు వెతకడం ప్రారంభించారు..అయితే ఆ హూడీ రేట్స్ చూసి అందరికి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.
ఎందుకంటే ఆ హూడీ ధర అక్షరాలా 250 డాలర్లు ఉంటుంది..అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 28 వేల రూపాయిలు అన్నమాట..అది ఒక అభిమాని వెతికి సోషల్ మీడియా లో పెట్టగా తెగ వైరల్ గా మారిపోయింది..ఇక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో అతి త్వరలోనే విడుదల చేయబోతుంది ఆహా మీడియా టీం..అంతే కాకుండా ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కాబోతుందట..ఈ ఎపిసోడ్ తోనే రెండవ సీజన్ ముగిసిపోతుంది.