Chiranjeevi And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు కొన్ని దశాబ్ధాల వరకు అలా గుర్తుండిపోతాయని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదే క్రమంలో ఆయన అప్పట్లో మంచి సినిమాలు చేశాడు. ఇక ముఖ్యంగా విజయ బాపినీడు డైరెక్షన్ లో ఆయన చేసిన ఖైదీ నెంబర్ 786 సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా స్టోరీని ప్రొడ్యూసర్ మొదట బాలయ్య బాబుకి వినిపించాడు ఆయనకి కథ నచ్చలేదు అని చెప్పడంతో ఆ సినిమా ప్రొడ్యూసర్ చిరంజీవి దగ్గరికి వచ్చి కథ చెప్పి ఆయన్ని సినిమా కోసం ఒప్పించాడు. ఇక చిరంజీవితో సినిమా మెటీరియలైజ్ అవుతుంటే బాలకృష్ణ తను విన్న ఈ కథను తన సన్నిహితుల దగ్గర చెప్తే కథ బాగుంది నువ్వే చెయ్ మంచి పేరు వస్తుందని చెప్పడంతో బాలయ్య ఆ సినిమా నేనే చేస్తాను అని చెప్పినప్పటికీ అది చిరంజీవి చేస్తున్నాడు అని ప్రొడ్యూసర్ చెప్పడంతో బాలయ్య కొంతవరకు నిరాశ చెందినట్టుగా తెలుస్తుంది.
ఇక వేరే వాళ్ళతో చిరంజీవితో మాట్లాడించి ఈ సినిమా బాలయ్య చేస్తాడు మీరు వదిలేయండి అని చెప్పించినప్పటికి చిరంజీవి మాత్రం లేదు నేను ఈ సినిమా చేస్తాను అని కమిట్ అయ్యాను అలాగే నా ఇమేజ్ కి తగ్గట్టు గా మార్పులు, చేర్పులు చేయించాను ఇప్పుడు ఎలా వదిలేయాలి అని చిరంజీవి అనడంతో బాలయ్య బాబు చిరంజీవి పైన అప్పట్లో కొంచెం కోపంగా ఉన్నాడని వార్తలు కూడా వచ్చాయి.
నిజానికి ఈ విషయంలో ఎవరిది తప్పులేదు ఫస్ట్ బాలయ్య చేయను అని చెప్పడం తో ఆ స్టోరీ చిరంజీవి దగ్గరికి వచ్చింది. ఇక చిరంజీవి తన ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయించి షూట్ కి వెళ్లే క్రమంలో బాలయ్య నేను ఆ సినిమా చేస్తాను అంటే చిరంజీవి మాత్రం ఎందుకు ఆ సినిమాను వదులుకుంటాడు అంటూ చిరంజీవి అభిమానులు కూడా అప్పట్లో ఈ విషయం మీద స్పందించారు.ఇక చిరంజీవి ఈ సినిమా చేసి ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ విషయంలో అప్పట్లో వీళ్ళ మధ్య కొన్ని విభేదాలు కూడా వచ్చినట్టుగా వార్తలు అయితే వచ్చాయి…