Prabhas: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా కూడా మనం పైకి రావాలంటే కొన్ని విషయాలలో నిక్కచ్చి గా ఉండాలి. మనం అలా ఉన్నప్పుడే మన కెరియర్ ని మనం మనకు నచ్చినట్టు గా డిజైన్ చేసుకుంటాం… ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ వింటే మికే అర్థం అవుతుంది.
ప్రభాస్ లాంటి ఒక టాప్ హీరో తనదైన రీతిలో సక్సెస్ లు సాధిస్తున్న క్రమంలో మొహమాటానికి పోయి ఒక సినిమా చేశాడు ఆ సినిమా ఆయన కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ప్రభాస్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే అది ఏ సినిమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి వరుస సినిమాలతో తనదైన రీతిలో సక్సెస్ లు కొట్టి తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న సందర్భంలో కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ రెబల్ అనే ఒక కథను చెప్పి ప్రభాస్ ని ఆ కథలోకి ఒప్పించి అతని తో సినిమా చేశాడు. నిజానికి ఆ సినిమా చేయడం ప్రభాస్ కి కూడా ఇష్టం లేదు కానీ రాఘవ లారెన్స్ మాస్టర్ కొంచెం ఇబ్బంది పెట్టడంతో మొహమాటానికి పోయి ఆ సినిమాని ఒప్పుకున్నాడు.
ఆయన డైరెక్షన్ లోనే ఆ సినిమాను చేశాడు ఫైనల్ గా సినిమా ప్రభాస్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇలాంటి క్రమంలో సినిమా పోతే పోయింది కానీ ఇంకొకసారి మొహమాటానికి పోయి సినిమాలు చేయకూడదనే ఒక జీవిత సత్యాన్ని మాత్రం ప్రభాస్ నేర్చుకున్నాడనే చెప్పాలి ఇంకా అప్పటినుంచి ప్రభాస్ కథ నచ్చితేనే సినిమా చేస్తున్నాడు. లేదంటే వదిలేస్తున్నాడు అంతే తప్ప మొహమాటనికి పోయి సినిమాలైతే చేయడం లేదు.
ఇక దీని వల్ల చాలా తెలుసుకున్న ప్రభాస్ ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ విన్న తర్వాత మాత్రమే ఆ సినిమా చేస్తానని ఓపెన్ గా చెప్పెస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఎక్కడైనా మొహమాటం అనేది చాలా డేంజర్ అందుకే మొహమాటానికి పోయి ఏ పని చేయకూడదనే విషయం మాత్రం గుర్తు పెట్టుకుంటే మనం మన జీవితం లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలుంటాయంటూ మరి కొంతమంది ఈ విషయం మీద కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమాతో తనదైన రీతిలో మరొకసారి తన సత్తా చాటుతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీ కలక్షన్లను వసూలు చేసే దిశగా ముందుకు దూసుకెళ్తుంది…