Thandel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో నాగచైతన్య ఒకరు. ఈయన ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక సినిమా సినిమాకి మధ్య వేరియేషన్ మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకుంటూ సినిమా ప్లాప్ అయిన హిట్ అయిన ప్రయోగాలు మాత్రం చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు… నిజానికి నాగచైతన్య చేసిన అన్ని సినిమాలు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయినప్పటికీ ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆయన సినిమాలనేవి ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇక ఇది ఇక ఉంటే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో డైరక్టర్ చందు మొండేటి మంచి దర్శకుడి గా పేరు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు నాగ చైత్యన్య తో కలిసి తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ అర్థం ఏంటి అనేది సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది…
ఇక దాంతో ఈ సినిమా టైటిల్ గురించి క్లారిటీగా చందు ముండేటి మాట్లాడుతూ తండేల్ అంటే నాయకుడు లేదా కెప్టెన్ అని అర్థం అంటూ చెప్పాడు… ఎవరైతే తన వాళ్ళ కోసం తన గురించి ఆలోచించకుండా ఒక నాయకుడిల ముందు నిలబడి పోరాటం చేస్తాడో అతడిని తండేల్ అంటారు అంటూ దానికి వివరణ కూడా ఇచ్చారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాగచైతన్య చాలా రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా కూడా మనకు తెలుస్తుంది. ఇక ఇప్పటికే నాగచైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి అనే రెండు సినిమాలు వచ్చాయి.
అందులో ప్రేమమ్ హిట్ అవ్వగా, సవ్య సాచి మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే సవ్య సాచి సినిమా ప్లాప్ కి చాలా కారణాలు ఉన్నాయంటు అప్పట్లో చందు మొండేటి క్లారిటీ ఇచ్చాడు ఇక ఎది ఏమైనా కూడా ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ మీద జనాల్లో విపరీతమైన అంచనాలు ఉండడంతో ఇద్దరు కలిసి మళ్ళీ కొత్త ప్రాజెక్టు చేసే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా పేరుకి అర్ధం ఏంటి అనే దాని మీద చాలా ప్రశ్నలు తలెత్తడం తో ఈ సినిమాకి ఇప్పుడే ఎక్కడ లేని ప్రమోషన్స్ జరిగాయి…
ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఇక ఇప్పటికే నాగచైతన్య గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాగ చైతన్య 100% లవ్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాతో కూడా వీళ్ళ బ్యానర్ లో రెండో హిట్ నమోదు చేయాలని నాగచైతన్య చూస్తున్నాడు… ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఒరిజినల్ లొకేషన్స్ లోనే చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు…