Mahesh Rajamouli Movie: మహేష్ బాబు-రాజమౌళి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ నగర శివారులో వేసిన స్పెషల్ సెట్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలోని అడవుల్లో చిత్రీకరణ జరుగుతుంది. ఇది లాంగ్ షెడ్యూల్ అని సమాచారం. మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా సైతం ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారట. అవుట్ డోర్ షూటింగ్ కావడంతో సన్నివేశాలు లీక్ అవుతున్నాయి. చక్రాల కుర్చీలో ఉన్న విలన్ ముందు మోకరిల్లిన మహేష్ బాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: సమంత అతనితో నిజంగానే డేటింగ్ చేస్తుందా? మరోసారి వార్తల్లోకి స్టార్ లేడీ!
లీక్స్ పై సీరియస్ అయిన రాజమౌళి ఆ వీడియో ఇంటర్నెట్ నుండి తొలగించేలా చర్యలు చేపట్టడాని సమాచారం. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో ఫోటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా SSMB 29 కథ కాశీ క్షేత్రంతో ముడిపడి సాగుతుంది అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. హీరో మహేష్ బాబు ప్రయాణంలో కాశీలో మొదలవుతుందట. అక్కడి నుండి ఆయన అడవులకు ప్రయాణం అవుతాడట. అందుకే భారీ ఎత్తున కాశీ పరిసరాలు, మణికర్ణిక ఘాట్ కి సంబంధించిన సెట్స్ రూపొందించారట.
ఇక రామాయణంలోని హనుమంతుడు స్ఫూర్తితో మహేష్ రోల్ విజయేంద్ర ప్రసాద్ డిజైన్ చేశాడట. ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుందని ఇప్పటికే రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక కథలో కాశీ క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కి దాన్ని ఎలా ముడి పెట్టారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా పాన్ వరల్డ్ మూవీకి అవసరమైన క్లిష్టమైన అంశాన్ని మహేష్ కోసం ఎంచుకున్నట్లు అర్థం అవుతుంది. రెండేళ్లకు పైగా SSMB 29 షూటింగ్ జరగనుంది.
రూ. 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యాడు. జిమ్ లో గంటల తరబడి వర్క్ అవుట్ చేస్తున్నాడు. జుట్టు, గడ్డం పెంచాడు. లీకైన వీడియోలో కూడా రాజమౌళి లుక్ రఫ్ అండ్ రగ్డ్ గా ఉంది. ఇక మహేష్ తన సాహసాలతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. SSMB 29లో హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణలు భాగం కానున్నారు.
Also Read: ఎట్టకేలకు ప్రణయ్ కేసు తీర్పు పై తొలిసారి స్పందించిన అమృత