https://oktelugu.com/

Kanguva Vs Matka: కంగువా-మట్కా లకు హైప్ ఏది? అర్థం కాని తెలుగు ఆడియన్స్ నాడి

రెండు బడా చిత్రాల విడుదలకు రంగం సిద్ధం కాగా జనాల్లో మాత్రం పెద్దగా హైప్ లేదు. సూర్య కంగువా, వరుణ్ తేజ్ మట్కా చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగులో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఆడియన్స్ నాడి ట్రేడ్ వర్గాలకు అర్థం కావడం లేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : November 13, 2024 7:48 pm
    Kanguva Vs Matka

    Kanguva Vs Matka

    Follow us on

    Kanguva Vs Matka: నవంబర్ 14న రెండు చెప్పుకోదగ్గ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. కంగువా, మట్కా పాన్ ఇండియా చిత్రాలుగా ఐదు భాషల్లో విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలకు తెలుగులో పెద్దగా హైప్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే ఈ విషయం అవగతం అవుతుంది. కంగువా భారీ బడ్జెట్ మూవీ. అందులోనూ సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన గజినీ భారీ విజయం సొంతం చేసుకుంది. పలు చిత్రాలు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టాయి.

    సూర్య మూవీ వస్తుందంటే హడావుడి ఉంటుంది. కానీ కంగువా విషయంలో అది కనిపించడం లేదు. కంగువా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. రెండు భిన్నమైన పాత్రలు సూర్య చేస్తున్నాడు. ఒకప్పుడు తెలుగు సినిమాలు చేసిన దర్శకుడు శివ కోలీవుడ్ లో సంచలనాలు నమోదు చేశాడు. ఆయన కంగువా చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. కంగువా పట్ల తెలుగు ఆడియన్స్ కి ఆశించిన స్థాయిలో ఆసక్తి ఎందుకు లేదనేది అర్థం కాని ప్రశ్న.

    మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ పరిస్థితి కూడా అలానే ఉంది. మట్కా చిత్రానికి భారీగా ప్రమోషన్స్ కల్పించారు. వరుణ్ తేజ్ పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సినిమాకు ప్రచారం కల్పించాయి. మట్కా ట్రైలర్ మెప్పించింది. దర్శకుడు కరుణ కుమార్ పలాస మూవీతో ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. ఇన్ని అనుకూలతలు ఉండి కూడా మట్కా చిత్రానికి రావాల్సినంత హైప్ క్రియేట్ కాలేదు.

    కాగా ఇటీవల దీపావళి కానుకగా విడుదలైన మూడు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం విశేషం. కేవలం కంటెంట్ నచ్చడంతో వాటికి బ్రహ్మరథం పట్టారు. కిరణ్ అబ్బవరం వంటి హీరో సినిమాకు రూ. 50 కోట్ల వసూళ్లు అంటే ట్రేడ్ వర్గాలను విస్మయపరిచిన అంశం. క చిత్రాని మోస్తరు ఓపెనింగ్స్ దక్కాయి. పాజిటివ్ టాక్ నేపథ్యంలో రోజు రోజుకు వసూళ్లు పెరుగుతూ పోయాయి. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టాయి.

    అమరన్ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ మిగతా రెండు చిత్రాలకంటే మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అవి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు. దానికి తోడు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కంగువా, మట్కా చిత్రాలు సైతం బలమైన కథలతో తెరకెక్కాయని ట్రైలర్స్ చూస్తే అర్థం అవుతుంది. కానీ అమరన్, లక్కీ భాస్కర్, క చిత్రాల మాదిరి వాటికి హైప్ క్రియేట్ కాలేదు. బహుశా పాజిటివ్ టాక్ వస్తే కానీ జనాలు థియేటర్స్ కి వెళ్లేందుకు ఆసక్తి చూపరేమో. ఏదేమైనా తెలుగు ప్రేక్షకుల నాడి అర్థం కావడం లేదు.