Second Day Highest Grossing Movie: ఈ ఏడాది రెండు వారాలకు ఒక్క పెద్ద హీరో సినిమా లేదా పాన్ ఇండియా సినిమా విడుదల అవుతూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..కరోనా లాక్ డౌన్ కారణంగా ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమాలు అన్ని వాయిదా పడుతూ ఇప్పుడు కరోనా మహమ్మారి శాంతించడం తో ఒక్కదాని తర్వాత ఒక్క సినిమా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసాయి..వీటిల్లో ఎక్కువ శాతం భారీ విజయాలు సాధించిన సినిమాలే అవ్వడం విశేషం..వరుస విజయాలతో టాలీవుడ్ కి పూర్వ వైభవం వచ్చింది అనే చెప్పాలి..ఒక్క రాధే శ్యామ్ మరియు ఆచార్య సినిమాలు మినహా ఈ ఏడాది ఇప్పటి వరుకు విడుదల అయినా ప్రతి పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి..నేడు నడుస్తున్న OTT కాలం లో హిట్ అయ్యితే మాత్రం ప్రేక్షకులు థియేటర్స్ వైపు క్యూ కడుతున్నారు కానీ, ఫ్లాప్ అయితే మాత్రం థియేటర్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూసేలా లేరు అనేదానికి ఉదాహరణగా నిలిచాయి రాధే శ్యామ్ మరియు ఆచార్య సినిమాలు.
భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ రెండు చిత్రాలు అభిమానుల అంచనాలను అందుకోవడం లో చాలా తీవ్రంగా విఫలం అయ్యాయి..రాధే శ్యామ్ సినిమా వీకెండ్ వరుకు బాగానే ఆడినప్పటికీ, నాల్గవ రోజు నుండి అతి దారుణంగా కలెక్షన్స్ తగ్గిపోయాయి..చివరికి వారం లోపే బిజినెస్ క్లోజ్ చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడింది..ఇక ఆచార్య సినిమా అయితే రెండవ రోజు నుండి బాక్స్ ఆఫీస్ చాలా ఘోరంగా ఇబ్బంది పడింది..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తూ ఉంటె ఈ సినిమా కూడా వారం లోపే బిజినెస్ క్లోజ్ చేసుకునేలా అనిపిస్తుంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అదే కనుక జరిగితే 40 ఏళ్ళ మెగాస్టార్ సినీ జీవితం లో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ సినిమా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు..ఇది ఇలా ఉండగా రాధే శ్యామ్ మరియు ఆచార్య సినిమాలతో మొదలుగొని..ఇటీవల కాలం లో విడుదల అయినా మన తెలుగు సినిమాలలో రెండవ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
Also Read: Malla Reddy: మల్లారెడ్డి ఫ్లాష్ బ్యాక్.. ఫుల్లీ ఎమోషనల్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR రెండవ రోజు ఏకంగా 31 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 2 చిత్రంగా నిలవగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా 14 కోట్ల రూపాయిలు, స్టయిలిష్ష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా 13 కోట్ల 75 లక్షల రూపాయిలు , లేటెస్ట్ సెన్సేషన్ KGF చాప్టర్ 2 13 కోట్ల 14 లక్షల రూపాయిలు, ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా 12 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్స్ ని వసూలు చేసి టాప్ 5 చిత్రాలుగా నిలిచాయి..ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ సినిమా 11 కోట్ల రూపాయిలు వసూలు చేసి రెండవ రోజు డబుల్ డిజిట్ షేర్స్ ని వసూలు చేసిన చిత్రాలుగా టాప్ 6 లో నిలిచాయి..ఇక మెగాస్టార్ చిరంజీవి హీరో నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య కేవలం 5 కోట్ల 15 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది..ఇది మెగాస్టార్ కి ఘోర అవమానం లాంటి కలెక్షన్స్ అని చెప్పొచ్చు.
Also Read: AP Employees: సీపీఎస్ ఉద్యోగుల దగ్గర కుప్పిగంతులు కష్టమే?