Highest Sold Movie Tickets On First Day: చాలా కాలం తర్వాత మన బాక్స్ ఆఫీస్ కాసుల గలగలా తో కళకళలాడిపోతుంది..దేశ వ్యాప్తంగా బాలీవుడ్ సినిమాలకంటే మన సినిమాలకు అత్యధిక వసూళ్లు రావడం ని చూస్తుంటే ప్రతి తెలుగోడి మనసు గర్వంతో పొంగిపోతుంది..పుష్ప , అఖండ , డీజే టిల్లు , భీమ్లా నాయక్ , #RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సినిమాలు కరోనా కారణంగా కుదేలు అయిపోయిన సినిమా పరిశ్రమకి పూర్వ వైభవం ని తీసుకొచ్చాయి..మధ్యలో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మరియు ఇటీవల విడుదల అయినా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయాలుగా నిలిచాయి..ఇది ఇలా ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరుకు విడుదల అయినా సినిమాలలో అత్యదిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
మొట్టమొదటగా మనం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా గురించి మాట్లాడుకోవాలి, బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన సినిమా ఇదే..మొదటి రోజు సుమారు 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రానికి దాదాపుగా 58 లక్షల టిక్కెట్లు మన ఇండియా లో అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న రిపోర్ట్..బాహుబలి 2 తర్వాత మొదటి రోజు అత్యధిక టికెట్స్ ఈ సినిమాకే అమ్ముడుపోయాయి..ఇక ఈ సినిమా తర్వాత విడుదల అయినా KGF చాప్టర్ 2 కి కూడా మొదటి రోజు దాదాపుగా 50 లక్షల రూపాయిల టికెట్స్ అమ్ముడుపోయాయి..ఇక ప్రాంతీయ బాషా చిత్రాలలో భీమ్లా నాయక్ సినిమాకి ఇప్పటి వరుకు మొదటి రోజు అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న రిపోర్ట్..మొదటి రోజు ఈ సినిమాకి దాదాపుగా 25 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట..ఇది ప్రాంతీయ బాషా చిత్రాలలో ఒక్క ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.
Also Read: Resentment Over Acharya Movie: ఆచార్య మూవీ పై ఇంత పగ ఎందుకు.. కారణం అదేనా?
ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమాకి 18 లక్షల టికెట్స్ అమ్ముడుపోగా , ఇటీవల విడుదల అయినా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకి మొదటి రోజు దాదాపుగా 14 లక్షల టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది..అలా పాన్ ఇండియా సినిమాలలో రాజమౌళి చక్రం తిప్పుతుంటే , ప్రాంతీయ బాషా చిత్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి రోజు ఫుట్ ఫాల్స్ లో నెంబర్ 1 గా నిలిచాడు..భవిష్యత్తు లో వీటి రికార్డ్స్ ని ఎవ్వరు బద్దలు కొట్టబోతున్నారో చూడాలి మరి..ఈ నెల 12 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో మహేష్ బాబు భీమ్లా నాయక్ రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతున్నాడు అని ఆయన అభిమానులు గట్టి నమ్మకం తో ఉన్నారు..చూడాలి మరి వారి నమ్మకాలను అంచనాలను ఈ సినిమా నిలబెడుతుందో లేదో అనేది.
Also Read: Pawan Kalyan: సీఎం జగన్ పేరు మార్చిన పవన్ కళ్యాణ్!