Koratala Siva Not Directed Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవలే విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..#RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సెన్సషనల్ హిట్స్ సాధించిన పాన్ ఇండియా సినిమాల తర్వాత విడుదల అయినా సినిమా కావడం,దానికి తోడు ఈ సినిమా నుండి విడుదల అయినా ఏ ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా జనాలను ఆకట్టుకోలేక పోవడం తో ఈ మూవీ పై ప్రారంభం నుండే అభిమానులకు తప్ప మిగతా ప్రేక్షకులకు ఆసక్తి కలుగలేదు..అందుకే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుండే అండర్ పెర్ఫర్మ్ చేస్తూ వచ్చింది..మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఓపెనింగ్స్ టాక్ మీద ఆధారపడాల్సి వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు..విడుదలకి ముందు ఈ మూవీ కి ఎంత లో బుజ్ ఉన్నదో..ఇక తీరా విడుదల అయినా తర్వాత మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో కలెక్షన్స్ పై తీవ్రమైన ప్రభావం పడింది.
దాని ఫలితంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్టర్ సినిమాగా నిలిచింది ఈ ఆచార్య చిత్రం..ఇది పక్కన పెడితే ఈ సినిమా ని కొరటాల శివ తాను డైరెక్షన్ లో చాలా తక్కువ కలిపించుకున్నాను అని..చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కూడా తాను ఎలా అయితే అవుట్ పుట్ రావాలి అని కోరుకున్నానో అదే రకమైన అవుట్ పుట్ ని రప్పించారు అని..నేను కేవలం వాళ్లిదరు కలిసి అలా నటిస్తున్న మూమెంట్స్ ని కెమెరా కాప్చర్ చేశాను అంటూ ఆచార్య మూవీ ప్రొమోషన్స్ లో చెప్పుకున్న సంగతి మన మన అందరికి తెలిసిందే..కొరటాల శివ చేసిన ఈ కామెంట్స్ పై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది..ఈ సినిమాకి కొరటాల శివ పేరుకి మాత్రమే దర్శకుడు అని..డైరెక్షన్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి చేసాడు అని..కొన్ని సన్నివేశాలు కూడా ఆయనే రాసుకున్నాడు అని..ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి.
Also Read: Acharya Industry Hit: ఈ చిన్న మార్పులు చేసి ఉంటే ఆచార్య ఇండస్ట్రీ హిట్ అయ్యేదా..?
చిరంజీవి కాజల్ కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చిరంజీవి గారే రాసారు అని..కానీ ఆ సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఫైనల్ ఎడిటింగ్ లో చూసేసరికి చాలా బాడ్ అవుట్ పుట్ వచ్చింది అని..అందుకే ఆ సన్నివేశాలు తొలగించేసారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది..అంతే కాకుండా ఈ సినిమా స్క్రిప్ట్ ని మొదట అనుకున్నప్పుడు చిరంజీవి యువతరం లో ఉన్నప్పటి పాత్ర ని రామ్ చరణ్ చెయ్యాల్సింది అని..కానీ ఇద్దరు ఒక్కే ఫ్రేమ్ మీద కనిపించడం కోసం చిరంజీవే కొరటాల చేత సెకండ్ హాఫ్ మొత్తం మార్చేశాడు అని టాక్ వినిపిస్తుంది..సెకండ్ హాఫ్ డెవలప్ చేసిన తర్వాత సిద్ద పాత్రకి తొలుత కొరటాల శివ రామ్ చరణ్ ని అనుకున్నప్పటికీ, ఆ సమయం లో రామ్ చరణ్ #RRR మూవీ షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల , కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు ని ఆ పాత్రలో నటింపచేసేందుకు ప్రయత్నం చేసాడు అని..కానీ చిరంజీవి రామ్ చరణ్ కోసమే పట్టుబట్టడం తో రాజమౌళి తో మాట్లాడించి డేట్లు సరుబాటు చేసుకున్నారు అని ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి.
Also Read: Prashant Kishor: కొత్త పార్టీతో సంచలనం.. దేశ రాజకీయాలను ప్రశాంత్ కిషోర్ ప్రభావితం చేయగలడా?