OTT: ఓటీటీ అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీగా అవతరించింది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ ని ఆస్వాదిస్తున్నారు. ఇండియన్ మార్కెట్ పరిధి చాలా ఎక్కువ. 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో కావాల్సినంత బిజినెస్ జరుగుతుంది. ఇండియాలో పదుల సంఖ్యలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిలో అత్యంత జనాదరణ కలిగిన ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఒక 10 వరకు ఉన్నాయి. ఓటీటీ కంటెంట్ పై పరిమితులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం.
న్యూడిటీ, వైలెన్స్, అభ్యంతరకర పదాల మోతాదు ఎక్కువ కావడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డిజిటల్ కంటెంట్ పై చట్ట సభల్లో కూడా చర్చలు జరిగాయి. డిజిటల్ కంటెంట్ కి సెన్సార్ ఉండాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. గత ఏడాది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్, కేబుల్ టీవీ సంస్థలు షోలు, సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్ కి ముందు రివ్యూ కమిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది.
దీనిపై నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు ఆందోళన వ్వక్తం చేశాయి. లెక్కకు మించిన సిరీస్లు, సినిమాలు కలిగిన అంతర్జాతీయ ఫ్లాట్ ఫార్మ్ ప్రతి ఒక్క దాన్ని రివ్యూ చేసి ప్రసారం చేయడం కుదిరే పనేనా అంటున్నారు. అదే సమయంలో ఈ పరిమితులు క్రియేటివ్ ఫ్రీడమ్ ని దెబ్బ తీస్తాయని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలు ఎలాగైతే తప్పక సెన్సార్ సర్టిఫికెట్ పొందాలో డిజిటల్ కంటెంట్ కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది.
Also Read: Love Me OTT: ఓటీటీలో బేబీ హీరోయిన్ కొత్త మూవీ… లవ్ మీ ఎక్కడ చూడొచ్చంటే?
దీని కోసం కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ, బ్రాడ్కాస్టింగ్ అడ్వైజరీ కౌన్సిల్ వంటి బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు. కాగా అమీరా ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ మహరాజ్ నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదల కావాల్సి ఉండగా గుజరాత్ హైకోర్ట్ స్టే విధించింది. హిందువుల మనోభావాలు ఆ చిత్రం కారణంగా దెబ్బ తినే అవకాశం ఉంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే మూవీ అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేశారు, కోర్టును ఆశ్రయించారు.
Also Read: OTT: పంథా మార్చిన ఓటీటీ సంస్థలు… లాభాల కోసం కొత్త టెక్నిక్!
కాగా నేడు నెట్ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ప్రధాన డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ తో పాటు గూగుల్, మెటా ప్రతినిధులను ది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ చర్చలకు పిలిచింది. ఈ మీటింగ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ పై కొత్త చట్టాల గురించి చర్చించనున్నారు. ఓటీటీ సంస్థలపై ఆంక్షలు అధికమైన నేపథ్యంలో అది శరాఘాతం అవుతుంది. పరిమితుల మధ్య ప్రేక్షకుల డిమాండ్ మీట్ కాలేక సంస్థలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అదే సమయంలో మితిమీరిన హింస, న్యూడిటీ, ఫౌల్ లాంగ్వేజ్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది..
Web Title: What is the future of ott in india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com