Boyapati Srinu: బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 మూవీ ఇవాళ్ళ రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనుకోని సందర్భాలలో సినిమాని పోస్ట్ పోన్ చేశారు. బోయపాటి ఇప్పటికే ‘స్కంద’ సినిమాతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. అలాంటి బోయపాటి ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాతో భారీ విజయాన్ని సాధించి మరోసారి స్టార్ హీరోతో సినిమా చేయాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమయంలో సరిగ్గా రిలీజ్ సమయానికి సినిమా వాయిదా పడడం అనేది ఆయన కెరీర్ కి చాలా వరకు ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి…ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల సినిమా క్రేజ్ కూడా తగ్గుతోంది. ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేసినప్పటికి అంత బజ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సినిమాతో కొంతవరకు కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక తన ఎంటైర్ కెరియర్లో చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించినప్పటికి బాలయ్య బాబుతో ఆయన చేసిన సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. అలాంటి బోయపాటి – బాలయ్య కాంబినేషన్ మరోసారి తెరమీదకి వస్తుందని ప్రతి ఒక్కరీ అంచనాలు తార స్థాయికి వెళ్లిపోయాయి.
కానీ చివరి నిమిషంలో ప్రేక్షకులను అలాగే బాలయ్య బాబు అభిమానులను నిరాశ పరచడం అనేది కరెక్ట్ కాదు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… నిజానికి ఈ సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ తో బోయపాటి తన సినిమాని ప్లాన్ చేస్తూ ప్రణాళికలు రూపొందించుకున్నాడు.
కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అనేది బోయపాటికి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి… గతంలో అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరోసారి వీళ్ళ కాంబో సెట్ అయితే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. ఇక ఫ్యూచర్ లో సెట్ అవుతోందా లేదా అనేది తెలియాల్సి ఉంది…