రంగస్థలంకు పుష్పకు తేడా అదే

విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్. తీసే ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలని చూసుకుంటారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. సినిమా సినిమాకు సంబంధం లేకుండా జాగ్రత్త పడుతుంటాడు . వెరైటీకే ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఆర్య, నాన్నకు ప్రేమతో, రంగస్తలం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా పుష్ప అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత చిత్రాలకు దీనికి సంబంధమే లేదని తెలుస్తోంది. పూర్తిగా వైవిధ్యభరితంగా ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి. రంగస్థలం […]

Written By: Srinivas, Updated On : July 15, 2021 10:19 am
Follow us on

విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్. తీసే ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలని చూసుకుంటారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. సినిమా సినిమాకు సంబంధం లేకుండా జాగ్రత్త పడుతుంటాడు . వెరైటీకే ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఆర్య, నాన్నకు ప్రేమతో, రంగస్తలం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా పుష్ప అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత చిత్రాలకు దీనికి సంబంధమే లేదని తెలుస్తోంది. పూర్తిగా వైవిధ్యభరితంగా ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి.

రంగస్థలం బాక్సాఫీసు దగ్గర ఎంత సందడి చేసిందో అందరికి తెలిసిందే. రాంచరణ్ ను పక్కా మాస్ గా చూపించి మంచి మార్కులు కొట్టేసిన సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ ను సైతం అదే కోవలో8 చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ అలాంటి సినిమా తీస్తాడని ఎవరు ఊహించలేదు. రాంచరణ్ కొత్త గెటప్ లో ప్రజెంట్ చేసి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు.

అల్లు అర్జున్ తో అంతకుముందు ఆర్య, ఆర్య-2 అంటూ ప్రేమ కథలను తీసిన సుకుమార్ మూడోసారి కూడా అలాంటి కథతోనే రావచ్చని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఊర మాస్ సినిమాతో వస్తున్నాడు. పుష్పరాజ్ పాత్రలో బన్నీ విభిన్నంగా కనిపిస్తున్నాడు. హీరో పాత్రలో కొంత నెగెటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ నటన సినిమాకే హైలెట్ అవుతుంది.

సినిమా గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ బన్నీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. డైలాగులు చెప్పే విదానంలో బాడీ లాంగ్వేజీ టీజర్ లో సీరియస్ గా అనిపించింది. కానీమిగతా సన్నివేశాల్లో మాత్రం కాస్త కామెడీగా ఉంటుంది. చాలా ముద్దొస్తుంటుంది. లొకేషన్స్ లో చూసినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సెట్స్ లో బన్నీ అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు.