Homeఎంటర్టైన్మెంట్Fighter Collections: బాక్సాఫీస్ వద్ద హృతిక్ రోషన్ ఫైటర్ పరిస్థితి ఏంటీ? ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Fighter Collections: బాక్సాఫీస్ వద్ద హృతిక్ రోషన్ ఫైటర్ పరిస్థితి ఏంటీ? ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Fighter Collections: హృతిక్ రోషన్ లేటెస్ట్ మూవీ ఫైటర్. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని జనవరి 25న విడుదలైంది. హృతిక్ రోషన్ కి జంటగా దీపికా పదుకొనె నటించగా… అనిల్ కపూర్ కీలక రోల్ చేశారు. ఫైటర్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఫైటర్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఓపెనింగ్ డే ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. ఫైటర్ మొదటి రోజు రూ. 41 కోట్ల గ్రాస్ రాబట్టింది. ట్రేడ్ వర్గాలు ఫైటర్ ఆశించిన స్థాయిలో ఫస్ట్ డే రాబట్టలేదని అంచనా వేశాయి.

అయితే సెకండ్ డే రిపబ్లిక్ డే నాడు ఫైటర్ వసూళ్ళలో చెప్పుకోదగ్గ జంప్ కనిపించింది. సెలవు దినం కలిసి వచ్చింది. దాంతో ఫైటర్ రెండు రోజులకు రూ. 64 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఓవర్సీస్ లో ఫైటర్ చిత్ర వసూళ్లు బాగున్నాయి. ఫస్ట్ డే $560000 వసూలు చేసింది. రెండు రోజులకు ఫైటర్ ఓవర్సీస్ వసూళ్లు వన్ మిలియన్ మార్క్ దాటాయి.

కాగా వీకెండ్ మరో రెండు రోజులు మిగిలి ఉన్నాయి. ఇది ఫైటర్ చిత్రానికి కలిసొచ్చే అంశం. శని, ఆదివారాల్లో ఫైటర్ మూవీ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. వంద కోట్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఫైటర్ మూవీలో దీపికా పదుకొనె బికినీ ధరించి దారుణమైన స్కిన్ షోకి పాల్పడింది. సినిమాలో దీపికా పదుకొనె బికినీ సన్నివేశాలు తొలగించారు. ఇక దీపికా ఆ విషయంలో హాలీవుడ్ భామలను కూడా మించేసేలా ఉంది.

కాగా నెక్స్ట్ హృతిక్ రోషన్ వార్ 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ మరొక హీరో. ఈ భారీ మల్టీస్టారర్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వార్ 2 ఆల్రెడీ సెట్స్ పై ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2. అధిక భాగం విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. హీరోయిన్స్ ని ప్రకటించాల్సి ఉంది.

Exit mobile version