Allu Arjun: అల్లు అర్జున్ సందీప్ వంగ కాంబో లో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?

ప్రభాస్ ని చాలా కొత్తగా చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : January 27, 2024 12:38 pm
Follow us on

Allu Arjun: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత ఆ సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక దాంతో రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి అనిమల్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇక ఈ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టి బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా అభిమానుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ ని చాలా కొత్తగా చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ తో చేసే సినిమా కంప్లీట్ బోల్డ్ సినిమా అని తెలుస్తుంది. అయితే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు ఎలాంటి బోల్డ్ సినిమాలో దానికి మించిన క్యారెక్టర్ లో బన్ని ని ప్రజెంట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని సందీప్ చూస్తున్నాడు.

మరి ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ కూడా సందీప్ డైరెక్షన్ లో ఎక్స్పరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా కల్ట్ క్లాసికల్ గా నిలిచిపోతుందా లేకపోతే అలాంటి బోల్డ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ని ప్రేక్షకులు చూస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా పట్టాలెక్కాలంటే మరో రెండు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిందే…

ఎందుకంటే ఇప్పటికే సందీప్ ప్రభాస్ తో కమిట్ అయిన స్పిరిట్ సినిమాని తెరకెక్కించాలి. అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక చేయాలి. ఇవి రెండు సినిమాలు అయిపోయిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ అనేది సెట్స్ మీదకి వస్తుంది. ఇక మొత్తానికైతే సందీప్ తో అల్లు అర్జున్ ఒక భారీ ఎక్స్పరమెంట్ అయితే చేస్తున్నాడని క్లారిటీగా తెలుస్తుంది…