https://oktelugu.com/

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు బడ్జెట్ ఎంత..? ఆ సినిమా ఎంత వసూలు చేస్తే ప్రొడ్యూసర్ కి లాభాలు వస్తాయి..?

సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి సర్వ సాధారణం. ఇక హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా చాలా మంది అభిమానులను సంపాదించుకున్న హీరోలు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 01:06 PM IST

    Hari Hara Veera Mallu

    Follow us on

    Hari Hara Veera Mallu: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే వాళ్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తారాస్థాయిలో ఉందనే చెప్పాలి. మిగతా హీరోల విషయంలో వాళ్ళ సినిమాలు సక్సెస్ అయితే వాళ్లకి క్రేజ్ అనేది పెరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం దానికి భిన్నంగా జరుగుతుంది. ఆయన సినిమాలు ఎంత ఎక్కువ ఫ్లాప్ అయితే అంత ఎక్కువమంది ఆయనకి ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ఇక దీనిద్వారా ప్లాప్ సినిమాలతో ఎక్కువ క్రేజీని సంపాదించుకున్న హీరో కూడా పవన్ కళ్యాణ్ గారే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే… అయితే ఎ ఏం రత్నం ప్రొడ్యూసర్ గా క్రిష్ డైరెక్షన్ లో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాని స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ సినిమాని ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. ఇక కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఎ ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయనకు పెద్ద సినిమాను డైరెక్ట్ చేసిన అనుభవం ఏమీ లేదు. అయినప్పటికీ తన డైరెక్షన్ లో నటించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతానికి అయితే పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే లేదు. మరి ఏ ధైర్యంతో ప్రొడ్యూసర్ ఎ ఏం రత్నం ఈ సినిమా మీద అంత ఎక్కువ బడ్జెట్ ను పెడుతున్నాడు. పాజిటివ్ టాక్ వచ్చి పెట్టిన మణి రికవరీ అయితే పర్లేదు. కానీ ఒకవేళ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నట్లైతే ప్రొడ్యూసర్ భారీగా నష్టపోతాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    ఇక ఇప్పటివరకు ఆయన ఫైనాన్స్ తీసుకొచ్చి పెట్టిన డబ్బులకు కూడా విపరీతంగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుందని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి వీటన్నింటినీ కవర్ చేయాలి అంటే మాత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమాని తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తేనే అన్ని పోను ప్రొడ్యూసర్స్ కి ఏదైనా కొంచెం ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

    లేదంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం ఈ విషయం మీద స్పందించడం విశేషం…మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూట్ లో ఎప్పుడు పాల్గొంటాడు. ఈ సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తాడు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది…