Telugu Film Industry Best Villain: ఇది అత్యంత కష్టం అయిన ప్రశ్న. అలనాటి ఎస్వీఆర్ నుండి ఇవాల్టి సోనూసూద్ వరకు ఎందరో మేటి ఉత్తమ విలన్లు మన తెలుగులో వచ్చారు. మరి కేవలం ఒకరి గురించి మాత్రమే ప్రస్తావించాలి అంటే.. నిజంగా కష్టతరమైన అంశం. పైగా విలన్ ఎంత బలవంతుడు అయితే, హీరో అంత గొప్పవాడవుతాడు, ఇది తెలుగు సినిమా నియమం కూడా. అలాంటి మన విలన్లలో బెస్ట్ ఎవరు అంటే ? ఎలా చెప్పగలం. కానీ, చెప్పాలి కనుక ముందుగా ‘రావు గోపాల రావు’ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మిగిలిన విలన్లు అందరూ పూర్తి కాలం విలన్లుగా నటించలేదు. మంచి మంచి పాత్రలు పోషించారు.
కానీ, రావు గోపాల్ రావు గారు మాత్రం ఎక్కువ సినిమాల్లో విలన్ గా తక్కువ సినిమాలలో మంచి వ్యక్తి గా నటించారు. మరి అలాంటి రావు గోపాల్ రావు గారు పూర్తి స్థాయిలా ఎలివేట్ చేసిన చిత్రం ముత్యాల ముగ్గు. ఈ కింద పోస్టర్ చూశారా ?, హీరోకి బదులు విలన్ తో ఈ సినిమా పోస్టర్లు అన్నీ ప్రింట్ చేయబడ్డాయి. డబ్బు ఇస్తే చాలు తిమ్మిని బమ్మి చేయగల కాంట్రాక్ట్ కిల్లర్ గా ఇందులో రావు గోపాల్ రావు నటన అద్భుతం. ఓపెనింగ్ షాట్ కూడా ఎర్రని ఆకాశం వైపు చూస్తూ ” సెగట్రీ , ఆకాశం సూడు ఎంత ఎర్రగా ఉందో, పైనేదో మడ్డర్ జరిగినట్లు లేదూ, మడిసన్నాక కూసింత కళా పోషణ ఉండాలయ్యా, ఊరికే తిని తొంగుoటే మడిసి కి గొడ్డు కి తేడా ఏటున్ది, సర్లేద్దు ఎదవ నూసెన్సు, ఎప్పుడు మడ్డర్లేనా” అనే యాసతో రావు గోపాల్ రావు గారు చెప్పిన డైలాగ్ అద్భుతం.
Also Read: Senior NTR- ANR: వేదిక పై కృష్ణుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్ మాటలకు ఊగిపోయిన ప్రేక్షకులు
నిజానికి తెలుగు సినిమా చరిత్రలో తమ నటనతో హీరోలను తొక్కేసి ఘనమైన ఖ్యాతి గడించిన విలన్లు చాలామంది ఉన్నారు. ఎస్వీయార్, రాజనాల వంటి మహామహులు ఉన్నారు. మరి వీరి అందరిలో కల్లా ఎందుకు రావు గోపాల్ రావు గురించే ముందుగా మాట్లాడుకోవాలి అంటే ?, కారణం ఒక్కటే. రావు గోపాల్ రావు లో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. ఆయన ఎవ్వరితోనూ ఫైట్ చేయరు. కేవలం తన తెలివితో, తనమాటలతో, తన క్యారెక్టర్ తోనే తన విలనిజాన్ని చూపిస్తారు.
ఇక పక్కన అల్లు రామ లింగయ్య గారు కూడా ఉంటే , లారెల్ హార్డి లాగా వీళ్ళద్దరిది కూడా మంచి జోడీ. అందుకే, రావు గోపాల్ రావు బెస్ట్ విలన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీగా ఎప్పటికీ నిలిచిపోతారు. అలా అని మిగిలిన విలన్లను తక్కువ చెయ్యట్లేదు. రావు గోపాల్ రావు గారి గొప్పతనం గురించి మాత్రమే చెబుతున్నాం. ఉదాహరణకు ‘ముత్యాల ముగ్గు’ చిత్రం తీసుకుందాం.
ఈ చిత్రంలో రావుగోపాలరావుది పక్కా విలన్ పాత్ర. నిజానికి ఆ సినిమాలో శ్రీధర్ అనే హీరో ఉన్నాడు. ‘బాపు గారి దర్శకత్వంలో మొదటిసారి హీరోగా నటిస్తున్నాను, ఇక నాకు హీరోగా సినిమాలు వస్తాయి’ అంటూ అప్పట్లో శ్రీధర్ ఎంతో ఆనందించాడు. కానీ రావు గోపాలరావు విలనీజం ముందు, శ్రీధర్ హీరోగా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. రావుగోపాలరావు గారి విలనిజం అంత పవర్ ఫుల్.
Also Read:OTT Releases This Week: ‘ఓటీటీ’: ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?