Senior NTR- ANR: ఇప్పుడు చెప్పుకునే సంఘటన ఒక అపురూప దృశ్యం. వేదిక పై ఎన్.టి. రామారావు ఓకే ఒక్క సారి కృష్ణునిగా నటించిన ఒకే ఒక్క సందర్భమిది. అందుకే ఎన్టీఆర్ అభిమానులకు ఇది అపురూప దృశ్యం అయ్యింది. ఇంతకీ ఇది ఎప్పటి సంగతో తెలుసా ?, అవి దివిసీమ ఉప్పెన వచ్చిన రోజులు. ఉప్పెన వచ్చిన సందర్భంగా అప్పటి సినిమా రంగ ప్రముఖులు ఇతోధిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
దీనితో పాటుగా రాష్ట్రంలో కళా రూపాలు ప్రదర్శించి, నిధులు సేకరించారని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో గొప్ప ప్రదర్శన నిర్వహించారు. ‘ శ్రీకృష్ణ తులాభారం ‘ నాటకం వేశారు. ఇందులో కృష్ణునిగా ఎన్టీఆర్, రుక్మణీదేవి గా దేవిక, సత్యభామగా మహానటి సావిత్రి, వసంతకునిగా రేలంగి నారదునిగా టి.ఎల్. కాంతారావు నటించారు. అప్పట్లో ఈ నాటకం కోసం అభిమానులు ఎగబడ్డారు.
Also Read: OTT Releases This Week: ‘ఓటీటీ’: ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?
పైగా ఎన్టీఆర్ వెండి తెర పై 33 సార్లు కృష్ణునిగా కనిపించినప్పటికీ, వేదికపై మాత్రం ఆయన ఆ పాత్ర చేసింది ఈ ఒక్కసారే. అందుకే ఈ నాటకానికి ఆ రోజుల్లో విపరీతమైన ఆదరణ లభించింది. ముఖ్యంగా ఆ సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాశ్వరరావు… “అదిగో కలియుగ కృష్ణుడు ఎన్. టి. రామారావు గారు విచ్చేస్తున్నారు.” అనగానే హాలంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది.
ఏఎన్నార్ సైతం ఈ కరతాళ ధ్వనులు విని షాక్ అయిపోయారు. తాను ఎన్టీఆర్ ను పొగిడితే.. తనకు ఇంత గొప్ప ఆదరణ వస్తుందా అనే విషయాన్ని ఆయన అప్పుడే గ్రహించారు. అప్పటి నుంచి ఏఎన్నార్ సాధ్యమైనంత వరకూ.. ఎన్టీఆర్ ను పొగుడుతూ ఉండేవారు. ఏది ఏమైనా తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయిన మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు.
జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, మన ఆత్మగౌరవాన్ని పెంచిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్. తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పి.. కులం, మతం, ప్రాంతం, అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఘనత ఒక్క ‘ఎన్.టి.ఆర్’కు మాత్రమే సాధ్యం అయింది.
Also Read:Megastar Chiranjeevi : చిరంజీవిది ఎంత గొప్ప మనసు..