https://oktelugu.com/

Devara Movie : దేవర సినిమాలో ఎన్టీయార్ డ్యూయల్ రోల్ చేయడం లేదా..? ఇదెక్కడి ట్విస్ట్ రా మామ…

రోజు రోజుకి తెలుగు సినిమాల స్థాయి భారీ రేంజ్ లో పెరుగుతుంది. ఇక ఇప్పుడు మన ఇండస్ట్రీ నుంచి ఏ స్టార్ హీరో సినిమా వచ్చిన కూడా దాదాపు 1000 కోట్లు సంపాదించడమే లక్ష్యం గా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 14, 2024 / 09:25 AM IST

    Devara Movie

    Follow us on

    Devara Movie : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది. దాదాపు ఈ సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే రెండు క్యరెక్టర్లలో నటించడానికి ఎన్టీఆర్ చాలా వరకు కష్టపడి మరి తన మేకోవర్ ను తీర్చిదిద్దుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం లేదట. తను ఒక్కడే రెండు పాత్రలను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు.

    కానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం చాలావరకు వైరల్ గా మారుతుంది. మరి ఎన్టీఆర్ ఒక్కడే ఇద్దరిలా నటించాల్సిన అవసరం ఏముంది…తన వాళ్ళను కాపాడడం కోసం దేవర శత్రువులను అంతం చేస్తుంటే తన కొడుకు మాత్రం ఒక పిరికివాడి పాత్రలో నటిస్తూ కనిపించాడు.

    మరి ఈ రెండు పాత్రల్లో ఒక్క ఎన్టీఆర్ కనిపిస్తాడా? లేదంటే ఇద్దరు ఎన్టీఆర్ లను మనం చూడబోతున్నామా? అనే విషయం మీదనే సరైన స్పష్టత అయితే రావడం లేదు. ఇక ఆడియన్స్ ని మిస్ లీడ్ చేయడానికి కొరటాల చూస్తున్నారా దానికోసమే ట్రైలర్ లో ఇద్దరు ఎన్టీయార్లు ఉన్నారనే విషయాన్ని మనకు ఎస్టాబ్లిష్ చేశారా అనే అనుమానులు కూడా వ్యక్తం అవుతున్నాయి.

    మరి ఈ విషయంలో కొరటాల ఎలాంటి స్ట్రాటజీని పాటిస్తున్నాడు అనేది ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లారిటీగా తెలుస్తోంది. మరి సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకుల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి…