Salaar: సలార్ చిత్రానికి వరల్డ్ వైడ్ ఎంత డిమాండ్ ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. విడుదలకు నెల రోజుల ముందు నుండే బుకింగ్స్ జోరందుకున్నాయి. యూఎస్ లో రికార్డు ప్రీమియర్స్ దిశగా సలార్ అడుగులు వేస్తుంది. కెజిఎఫ్ సిరీస్ తో బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ వంటి ఒక టాప్ స్టార్స్ తో ఆయన చేస్తున్న మూవీ కోసం సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. యూఎస్ లో ప్రీమియర్ సేల్స్ మొదలయ్యాయి. యూఎస్ ఆడియన్స్ సలార్ టికెట్స్ కోసం ఎగబడుతున్నారు. ప్రీమియర్స్ ప్రదర్శనకు మరో 33 రోజులు ముందే రికార్డు వసూళ్లు రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం 140 లొకేషన్స్ లో 4160 టికెట్స్ అమ్ముడుపోయాయి. $108925 డాలర్స్ రాబట్టింది. ఇంకా చాలా లొకేషన్స్ లో బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అప్పుడే లక్ష డాలర్ల మార్క్ దాటేసింది.
కేవలం ప్రీమియర్స్ ద్వారానే భారీగా వసూలు చేసే సూచనలు కలవు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. దాదాపు రూ. 175 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మినట్లు సమాచారం. ఏపీ/ తెలంగాణాలలో కలిపి రూ. 300 కోట్ల గ్రాస్ రాబడితే కానీ సలార్ హిట్ స్టేటస్ అందుకోదు. సలార్ నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకుంది.
సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. సలార్ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. కెజిఎఫ్ కథలో భాగమే… ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు. ఈ ప్రశ్నలకు ప్రశాంత్ నీల్ సమాధానం చెప్పడం లేదు. సినిమా చూసి మీరే తెలుసుకోండని అంటున్నారు. ప్లాప్స్ లో ఉన్న ప్రభాస్ సలార్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
#Salaar USA Premiere Advance Sales:
$108,925 – 140 Locations – 435 shows – 4160 Tickets Sold
Another Good Jump as more locations start to open. 33 Days till Premieres! pic.twitter.com/r9su1sbH8a
— Venky Reviews (@venkyreviews) November 19, 2023