Site icon OkTelugu

India Vs Australia World Cup Final: ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో బ్రేక్ అవ్వబోతున్న రికార్డులు ఇవే…

India Vs Australia World Cup Final

India Vs Australia World Cup Final

India Vs Australia World Cup Final: వరల్డ్ కప్ 2023 లో ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఆస్ట్రేలియా ఆరోవ సారి ప్రపంచకప్ టైటిల్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక అదే రీతి లో ఈ మ్యాచ్ లో గెలిచి ఇండియన్ టీమ్ కూడా మూడోసారి టైటిల్ గెలవాలని చూస్తుంది.ఇక ఈ ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం లో ఆడుతూ ఉండటం వల్ల ఇక్కడ కొన్ని రికార్డ్ లు బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది.దాంతో పాటు గా ఓవరాల్ గా కూడా కొన్ని రికార్డ్ లు బ్రేక్ అవ్వబోతున్నాయి అవి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం…

ఇంతకు ముందు 2015లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్ జరిగినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన మెల్‌బోర్న్ స్టేడియం లో ఈ మ్యాచ్ ఆడారు అందులో 93,000 మంది ప్రేక్షకులు ఆ మ్యాచ్ చూడటానికి వచ్చి అప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా అత్యధిక మంది చూసిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గా అది రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఈ రోజు 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడినప్పుడు 1,32,000 మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూడటానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది…దాంతో ఇంతకు ముందు ఉన్న రికార్డ్ కూడా బ్రేక్ అవుతుంది…

ఇక అలాగే జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో రికీ పాంటింగ్ 140 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీమ్ కి 359/2 పరుగులు చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఇది ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యధిక జట్టు స్కోరుగా మిగిలిపోయింది…

2023 ప్రపంచకప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా టీమ్ లు 350కి పైగా స్కోర్‌ చేస్తాయని చాలా మంది ఆశిస్తున్నారు. ఎందుకంటే రెండు టీమ్ లు కూడా చాలా బలమైన టీమ్ లు కావడంతో ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది…

ఇక 2003 ఫైనల్స్ లో భారత్‌ను 125 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ ఫైనల్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని సాధించిన మ్యాచ్ గా ఇది రికార్డ్ లకి ఎక్కింది…ఈ రోజు ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది…

ఈ రోజు ఆస్ట్రేలియాపై గెలిస్తే విరాట్ కోహ్లీ రెండో ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన తొలి భారతీయా క్రికెటర్‌గా నిలుస్తాడు.ఇక 2011లో ప్రపంచకప్ గెలిచిన ఎంఎస్ ధోని నేతృత్వంలోని భారత జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉండటం విశేషం…

క్రికెట్ వరల్డ్ కప్ 2023లో కూడా కోహ్లీ అత్యధిక పరుగులు సాధించాడు. 10 మ్యాచ్‌లలో 711 పరుగులతో, ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. 2003 ఎడిషన్‌లో టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి మరో 89 పరుగులు జోడిస్తే, ఒకే ఎడిషన్‌లో 800కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు…

ఇక ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ నాలుగు ప్రపంచకప్‌లు ఆడాడు మరియు అతని పేరు మీద 1741 పరుగులు చేశాడు. ఈ రోజు కోహ్లీ రెండు కంటే ఎక్కువ పరుగులు చేస్తే, రికి పాంటింగ్ పేరు మీద ఉన్న 1743 ప్రపంచ కప్ పరుగులను అధిగమిస్తాడు మరియు 2278 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ తర్వాత ప్రపంచ కప్‌లలో రెండవ అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలుస్తాడు…

ఇక బౌలింగ్ విషయానికి వస్తె
2023 ప్రపంచకప్‌లో ఆడిన 6 మ్యాచ్ ల్లో 23 వికెట్లు తీసి ఈ టోర్నీ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షమీ గుర్తింపు పొందాడు.ఇక అతను మూడు ప్రపంచ కప్‌లలో భారతదేశం తరపున ఆడాడు మరియు అన్ని ప్రపంచ కప్‌లలో కలిపి 54 వికెట్లు తీసి భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందాడు.ఇక ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్ అయిన గ్లెన్ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, ముత్తయ్య మురళీధరన్ (68) తర్వాతి స్థానంలో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ (58), లసిత్ మలింగ (56), వసీం అక్రమ్ (55). ఈరోజు కొన్ని వికెట్లు పడగొట్టిన షమీ టాప్-5లోకి వెళ్ళిపోతాడు…

ఇలా ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో వీటిలో ఎన్ని రికార్డ్ లు బ్రేక్ అవుతాయి అనేది చూడాలి…

Exit mobile version