Renu Desai in Tiger Nageswara Rao: పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బద్రి’ సినిమా టాలీవుడ్ కు పరిచయం అయిన రేణుదేశాయ్.. ఆ సినిమా సమయంలోనే ప్రేమలోపడింది. పవన్ కళ్యాణ్ కు అర్ధాంగిగా మారింది. ‘జానీ’ సినిమాలో ఈ రియల్ కపుల్ రియల్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇద్దరు పిల్లలు కలగడం.. వారి సంసారం సాగడం జరిగిపోయింది.

అయితే వ్యక్తిగత కారణాలతో రేణుదేశాయ్-పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటున్నారు. ఇద్దరూ వేరు వేరు భాగస్వాములను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. పవన్ తో విడిపోయాక ఫూణే వెళ్లిపోయిన రేణుదేశాయ్ ఆ మధ్య ఒక టీవీ షోలో సందడి చేసింది. సినిమాల్లో మాత్రం నటించలేదు.
దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత రేణుదేశాయ్ మళ్లీ ఓ సినిమాకు సైన్ చేసింది. ఇదో వైరల్ న్యూస్ అయ్యింది. ఇన్నేళ్లకు మళ్లీ ముఖానికి రంగు వేసుకొని నటిగా మనముందుకు వస్తున్న రేణుదేశాయ్ ను అందరూ ఆహ్వానిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన ‘హేమలత లవణం’ క్యారెక్టర్ లో రేణుదేశాయ్ నటించనున్నట్టు చిత్రం యూనిట్ తెలిపింది. పవన్ తో విడిపోయాక తెలుగు సినిమాలకు, ఇక్కడి వారికి దూరంగా జరిగిన రేణు తాజాగా మళ్లీ యాక్టివ్ కావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
