Actress Vanishree: తమిళనాడులో సీఎం స్టాలిన్ పాలన జనరంజకంగా ఉంటోంది. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. సీఎంగా ఎన్నికైన కొత్తలోనే ప్రతిపక్ష పార్టీపై దాడి చేసిన కార్యకర్తలపై కేసులు నమోదు చేయించి వార్తల్లో నిలిచారు. ఆయన తీసుకునే నిర్ణయం అందరిలో సంతోషం నింపుతోంది. రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకోవడం పరిపాటే. అదే కోవలో అలనాటి నటి వాణిశ్రీ స్థలం కూడా కబ్జాకు గురైంది.

దీనిపై ఆమె ఇరవై ఏళ్లుగా తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో విసిగిపోయిన వాణిశ్రీ ఇక స్థలం కోసం ఖర్చు చేయనని నిర్ణయించుకుంది. అక్కడి ప్రభుత్వం అన్యాయంగా కబ్జా చేసిన స్థలాలపై కొరఢా ఝుళిపించిన ప్రభుత్వం కబ్జాదారులపై చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వాణిశ్రీ స్థలం కూడా అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. దీంతో తమిళ ప్రభుత్వం హక్కుదారులకు పత్రాలు అందజేసింది. వీటిని అందుకోవడానికి వచ్చిన వాణిశ్రీ హర్షం వ్యక్తం చేసింది. సీఎం స్టాలిన్ ప్రశంసించింది. తనకు స్థలం వస్తుందో లేదోననే సందేహం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కృషి వల్ల తనకు న్యాయం జరిగిందని పేర్కొంది.
రూ. 20 కోట్ల విలువైన తన భూమి కబ్జాకు గురికావడంతో ఎంతో వేదన చెందాను. పదకొండేళ్లుగా కాళ్లరిగేలా తిరిగినా జరగని న్యాయం సీఎం కృషితో తన భూమి తిరిగి రావడం సంతోషకరం. ఆయన పాలనకు కితాబిచ్చారు. పదికాలాల పాటు సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. తెలుగు సినిమాల్లో 70వ దశకంలో ఆమెకు తిరుగులేకుండా పోయింది. కథానాయకిగా అనేక సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి నటులతో సినిమాలు చేసి అగ్రతారగా పేరు తెచ్చుకుంది.

ఆమె తరువాత జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటి వారు రాణించారు. వాణిశ్రీ అక్కినేనితో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అత్త పాత్రల్లో కూడా నటించింది. చిరంజీవితో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, వెంకటేశ్ తో బొబ్బిలిరాజా, నాగార్జునతో అల్లరి అల్లుడులో అత్త పాత్రల్లో జీవించింది. ఆమె నటనకు ఆ సినిమాలు బ్రహ్మాండమైన హిట్లు సాధించాయి. బొబ్బిలిరాజాలో ఆంధ్రా వారికి పొట్లగిత్తన్నా పొగరుబోతు అత్తన్నా భలే ఇష్టమనే డైలాకుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వాణిశ్రీకి స్థలం ఇప్పించడంలో తమిళనాడు ప్రభుత్వ కృషిని వాణిశ్రీ ప్రశంసిస్తున్నారు.
[…] […]