Prithviraj , Rajamouli
Prithviraj and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli) కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నప్పటికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. మరి పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో కూడా ‘జేమ్స్ కామెరూన్’ (James Cameron)లాంటి స్టార్ డైరెక్టర్ పక్కన నిలబడాలని ప్రయత్నంలో రాజమౌళి మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు నటించే వారెవరు అలాగే ఈ సినిమా కథ ఏంటి అనే దాని మీద గత కొన్ని రోజుల నుంచి చర్చలైతే జరుగుతున్నాయి… ఇక మొదట్లో ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో అయిన ‘పృధ్విరాజ్ సుకుమారన్’ (Prudhvi raj sukumaran) మహేష్ బాబు కి విలన్ గా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపించాయి. కానీ రీసెంట్ గా జాన్ అబ్రహం (John abhraham)మహేష్ బాబు ను ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నాడునే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మాత్రమే ఫైనల్ అయినట్టుగా రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.
మరి పృధ్విరాజ్ సుకుమారన్, జాన్ అబ్రహం ఇద్దరిలో ఎవరిని ఈ సినిమాలో తీసుకోబోతున్నాడు అనే దాని మీద సరైన క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే జాన్ అబ్రహం కే రాజమౌళి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక వీళ్ళతోపాటుగా తమిళ్ స్టార్ హీరో అయిన విశాల్ కూడా ఇందులో ఒక క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కథ విషయంలో కూడా చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఈ సినిమా కథ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) గత కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా ఇండియానా జోన్స్ (Indiana Jones) మూవీ ఇన్స్పిరేషన్ తో రాసుకున్న కథగా తెలియజేశాడు.
అలాగే ఒక నిధి వేటలో సాగే కథగా కూడా తను కొంతవరకు ఈ స్టోరీని రివీల్ చేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఒక నిధి వేటలో ముందుకు సాగుతూ అడ్వెంచర్లు చేస్తూ ఆ నిధిని దక్కించుకున్నాడా? లేదా అనే ఒక క్యూరియాసిటీతో ఈ సినిమా కథ అయితే ఉండబోతుందట. మరి రాజమౌళి తన మేకింగ్ తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నాడు అంటూ చాలామంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…