https://oktelugu.com/

Janhvi Kapoor: ”అందుకు కరెక్ట్ గా సరిపోతుంది”.. జాన్వీ కపూర్ పై కండోమ్ కంపెనీ అధినేత షాకింగ్ కామెంట్స్!

దేవర ఫేమ్ జాన్వీ కపూర్ ని ఉద్దేశించి కండోమ్ తయారీ సంస్థ అధినేత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ లో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. అసలు కండోమ్ కంపెనీ యజమాని జాన్వీ కపూర్ ప్రస్తావన ఎందుకు తెచ్చాడు? ఆ వివరాలు ఏమిటో చూద్దాం..

Written By: , Updated On : January 30, 2025 / 11:23 AM IST
Janhvi Kapoor (1)

Janhvi Kapoor (1)

Follow us on

Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. ఆమె శ్రీదేవి కూతురు కావడంతో సౌత్ లో ఆటోమేటిక్ గా ఆమెను జనాలు గుర్తిస్తున్నారు. దేవర మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఎన్టీఆర్ వంటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు కొరటాల శివ జాన్వీ కపూర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దేవర మూవీ రూ. 500 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే జాన్వీ కపూర్ పాత్రకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత లేదు. ఇది ఒకింత ఆమెను నిరాశపరిచే అంశం.

కాగా జాన్వీ కపూర్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. ఆమె రామ్ చరణ్ కి జంటగా ఆర్సీ 16లో నటిస్తుంది. ఈ చిత్రానికి ఆమె సైన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ఆర్సీ 16 తెరకెక్కిస్తున్నాడు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో మూవీ రూపొందనుందని సమాచారం.

కాగా జాన్వీ కపూర్ మోడలింగ్ ద్వారా కూడా గట్టిగా ఆర్జిస్తోంది. పలు సంస్థల ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే జాన్వీ కపూర్ ఇంత వరకు కండోమ్ యాడ్ లో నటించలేదు. కండోమ్ అనే భావన ఇండియన్స్ కి తప్పుగా తోస్తుంది. ఇప్పటికీ దాన్ని ఒక ప్రైవేట్ వస్తువుగా పరిగణిస్తారు. ఇక కండోమ్ యాడ్స్ అసభ్యకరంగా ఉంటాయి. మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.

కాబట్టి కండోమ్ యాడ్ లో నటించాలంటే గట్స్ కావాలి. సన్నీ లియోన్, రన్బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్ వంటి కొందరు నటులు మాత్రమే కండోమ్ యాడ్స్ చేశారు. అయితే కండోమ్ యాడ్ కి జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని మాన్ కైండ్ కండోమ్స్ అధినేత రాజీవ్ జునేజా అన్నారు. మ్యాన్ ఫోర్స్ కండోమ్స్ మగవాళ్ల కోణం చేసిన యాడ్ కాబట్టి కార్తీక్ ఆర్యన్ ని నటింపజేశాము, లేడీ అయితే.. ఈ యాడ్ కి జాన్వీ కపూర్ చక్కగా సరిపోతుంది. అన్నారు. అలాగే రన్బీర్ కపూర్ కూడా కండోమ్ యాడ్ కి గొప్ప ఎంపిక అని రాజీవ్ అన్నారు.

జాన్వీ కపూర్ గ్లామర్ ఆధారంగా ఒక రొమాంటిక్ యాడ్ కి జాన్వీ కపూర్ చక్కగా సరిపోతుందని ఆయన అభిప్రాయం. జాన్వీ కపూర్ కి ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోవాలి. మోడల్ గా ఉన్నప్పుడు నాగ చైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల సైతం కండోమ్ యాడ్ చేశారు. కండోమ్ యాడ్ లో నటించినంత మాత్రాన అన్యధా భావించాల్సిన అవసరం లేదు. ఇదంతా వృత్తిలో భాగమే అనుకోవాలి.