Rajamouli- Saloni: రాజమౌళి కి సలోని కి ఉన్న సంబంధం ఏంటి..? ఆ చనువు తోనే మర్యాద రామన్న లో తీసుకున్నాడా..?

మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.ఇక రాజమౌళి కెరియర్ లో చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

Written By: Gopi, Updated On : November 5, 2023 2:48 pm

Rajamouli- Saloni

Follow us on

Rajamouli- Saloni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్లలో రాజమౌళి ప్రథమ స్థానం లో ఉంటాడు.ఈయన ముందుగా తెలుగులో సూపర్ డూపర్ హిట్లు అందుకున్న తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మూవీని చేశాడు.ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో త్రిబుల్ ఆర్ సినిమాతో మరో ప్రయోగం చేసి అందులో కూడా సక్సెస్ అయ్యాడు.

ఇక ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.ఇక రాజమౌళి కెరియర్ లో చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అన్ని సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయి కానీ సునీల్ ని హీరోగా పెట్టి ఆయన తీసిన మర్యాద రామన్న సినిమాలో మాత్రం ఒక్క ఫైట్ లేకుండా చాలా సింపుల్ గా సినిమాని తీశారు.ఈ సినిమాలో సునీల్ హీరోగా నటించాడు, సలోని హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమాలో సలోని ని తీసుకోవడానికి కారణమేంటి అని అప్పట్లో చాలా రకాల వార్తలు వచ్చాయి.ఈ సినిమాలోనే కాకుండా మగధీర సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో సలోని కనిపిస్తుంది.

రాజమౌళి ఆమె ని ఎందుకు తీసుకున్నాడు అనే విషయాల మీద చాలా రకాల చర్చలు నడిచాయి అయితే రాజమౌళి వాళ్ళ అన్నయ్య అయిన కీరవాణి కి సలోని దూరపు చుట్టం అవుతుంది ఇలా కీరవాణి గారితో ఆమె మాట్లాడి ఫ్యామిలీ ఫ్రెండ్ గా పరిచయమైనప్పుడు అలాగే రాజమౌళి మర్యాదరామన్న సినిమా సునీల్ తో చేస్తున్నప్పుడు సునీల్ సినిమాలో పెద్ద హీరోయిన్లు అయితే వర్కౌట్ అవ్వదు కాబట్టి కొత్త హీరోయిన్లు లేదా అంత ఫేమ్ లేని హీరోయిన్లు అయితే బాగుంటుందని అనుకొని ఆ సినిమాలో సలోనిని తీసుకోవడం జరిగింది. అయితే అప్పట్లో రాజమౌళి సలోనిని తీసుకోవడం వెనక చాలా రకాల చర్చలు జరిగాయి అలాగే చాలా రకాల వార్తలు కూడా వచ్చాయి రాజమౌళికి సలోని కి మధ్య ఏదో సంబంధం ఉంది అన్నట్టుగా చాలా రకాల వార్తలు రాశారు.

కానీ నిజానికి వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే ఆ అమ్మాయి కీరవాణి వల్ల రిలేషన్ అవడంతో సినిమాలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఆ సినిమా తర్వాత సలోని మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసి ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది.ఇక ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయినట్టు గా తెలుస్తుంది…