Bhagwant Kesari Collections : బాలయ్యకు బాగా కలిసి వస్తుంది. పోటీగా విడుదలైన చిత్రాలు నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు… రెండు వారాలుగా పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో వసూళ్లు కొనసాగుతున్నాయి. రెండు వారాల అనంతరం కూడా భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. పని రోజుల్లో తగ్గిన వసూళ్లు వీకెండ్ లో మరలా పుంజుకున్నాయి. 17వ రోజు భగవంత్ కేసరి సత్తా చాటింది. ఏపీ/తెలంగాణాలలో రూ. 30 లక్షలు, వరల్డ్ వైడ్ రూ. 35 లక్షల షేర్ రాబట్టింది.
భగవంత్ కేసరి నైజాంలో రూ. 17. 5 కోట్లు, సీడెడ్ రూ. 8 కోట్లు, ఈస్ట్ అండ్ వెస్ట్ రూ. 9 కోట్లు, గుంటూరు రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ భగవంత్ కేసరి థియేట్రికల్ హక్కులు రూ. 67. 5 కోట్లకు అమ్మారని సమాచారం. ఇక 17 రోజులకు భగవంత్ కేసరి రూ. 66.8 కోట్లు వసూలు చేసింది. దాదాపు బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. ఈ సినిమాకు 69 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. రూ. 70 కోట్లు వస్తే హిట్.
నైజాం, గుంటూరు, ఓవర్సీస్ తో పాటు కొన్ని ఏరియాల్లో భగవంత్ కేసరి బ్రేక్ ఈవెంట్ దాటింది. ఓవర్ ఆల్ గా మాత్రం టార్గెట్ ఇంకా చేరుకోలేదు. దసరా సెలవులు భగవంత్ కేసరికి బాగా కలిసొచ్చాయి. ఈ రెండు వారాల్లో ఒక్క చెప్పుకోదగ్గ మూవీ కూడా విడుదల కాలేదు. ఇక లియో, టైగర్ నాగేశ్వరరావు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ అనుకూలతల మధ్య భగవంత్ కేసరి హిట్ స్టేటస్ కి దగ్గరైంది.
భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. బాలకృష్ణకు జంటగా కాజల్ నటించింది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కథలో కీలకమైన పాత్ర శ్రీలీల చేసింది. గ్లామరస్ రోల్ కి భిన్నంగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. భగవంత్ కేసరి చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో తెరకెక్కింది.