Niharika Konidela : పాపం నిహారిక కొణిదెల నెల సంపాదన ఇంతేనా..? మెగా ఫ్యామిలీ లో పుట్టి ఇన్ని కష్టాలా!

ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న నిహారిక, అభిమానులెవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇవి వింటే ఎవరైనా పని ఎంత విలువ అయినదో అర్థం చేసుకుంటారు.

Written By: NARESH, Updated On : August 17, 2024 9:29 pm

Niharika Konidela open comments on Second marriage

Follow us on

Niharika Konidela : ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి, అందుకోసం ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎంత శ్రమ పడ్డాడో ఊహించుకోవచ్చు. తన కష్టం విలువ అంటే ఏంటో తెలుసు కాబట్టే చిరంజీవి తన కుటుంబ సభ్యులు కూడా అలాగే ఎదగాలి అనుకోని వారికి కూడా అలవాటు చేసాడు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోలుగా ఎంతో కష్టపడే వారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం నేడు ఎలా అనుభవిస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా తన పిల్లలకు చిన్నతనం నుండే కష్టపడి పని చెయ్యడం వంటివి నేర్పించారు. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల రీసెంట్ గా ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న నిహారిక, అభిమానులెవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇవి వింటే ఎవరైనా పని ఎంత విలువ అయినదో అర్థం చేసుకుంటారు.

ఆమె మాట్లాడుతూ  ‘నన్ను చిన్నప్పటి నుండి నాన్న బయటకి ఎక్కడికీ కూడా ఒంటరిగా పంపేవాడు కాదు. దాంతో నా లోకం మొత్తం హైదరాబాద్ మాత్రమే అయ్యింది. ఇక్కడే నేను నా మొదటి జాబ్ కూడా చేశాను. చదువుకునే రోజుల్లో నేను ఒక పాపులర్ కేఫ్ లో పని చేసేదానిని, వారానికి నాకు వెయ్యి రూపాయిల జీతం ఇచ్చేవారు. అలా నేను నెలకు నా ఖర్చుల కోసం దాదాపుగా 5 వేల రూపాయిలు సంపాదించే దానిని. కష్టపడి పని చేసిన డబ్బులతో అనుభవించే జీవితాన్ని ఆస్వాదించి ఎంతో సంతోషించాను’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. ఆమె మాట్లాడిన ఈ మాటలను చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు.

నిహారిక కోరుకుంటే ఆమె తల్లిదండ్రులు ఉన్న స్థాయికి మహారాణి లాగా బ్రతకొచ్చు. కానీ ఆమె అలా బ్రతకాలి అనుకోలేదు. తన సొంత కష్టం మీద, తన కాళ్ళమీద తాను నిలబడాలని చిన్న వయస్సు నుండే అనుకుంది. పెద్ద అయ్యాక కూడా ఆమె అదే మనస్తత్వం తో ముందుకు పోతుంది. ముందుగా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అవి ఆమెకి సక్సెస్ ని ఇవ్వలేదు. సక్సెస్ రాలేదు కదా అని ఆమె ఇండస్ట్రీ ని వదిలి పారిపోలేదు. నిర్మాతగా రాణించాలని అనుకుంది. ముందుగా పలు వెబ్ సిరీస్లను నిర్మించింది. అవి అనుకున్న స్థాయిలో ఆమెకి లాభాలను తెచ్చిపెట్టలేదు. అయినప్పటికీ కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. ఎలా అయిన సక్సెస్ అవ్వాలి అనే కసితో కొత్తవాళ్ళని పెట్టి ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రం చేసింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కృషి , పట్టుదల ఉంటే ఏమైనా సాధించగలరు అనేందుకు యువత నిహారిక ని కూడా ఆదర్శంగా తీసుకోవాలి.