Kubera : కుబేర కోసం కష్టపడుతున్న శేఖర్ కమ్ముల… ఈసారి బొమ్మ బ్లాక్ బస్టరేనా..?

తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నారు. అలాగే ఇతర భాషల హీరోలకు కూడా ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది...అందుకే వాళ్ల సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారు...

Written By: NARESH, Updated On : August 17, 2024 9:34 pm
Follow us on

Kubera : కొంతమంది దర్శకులు చేస్తున్న సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక సినిమాకు సంబంధించిన వర్క్ లో వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టడమే కాకుండా తమ టీమ్ ను కూడా అందులో లీనమయ్యే విధంగా ప్రణాళిక రూపొందిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు. మరి ఇలాంటి క్రమంలో ఆయా దర్శకులు చేస్తున్న సినిమాలకు కూడా మంచి అంచనాలైతే ఉంటాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ ను హీరోగా పెట్టి కుబేర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఆయన తనను తాను స్టార్ డైరెక్టర్ గా మలుచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఇంతకుముందు తను చేసిన సినిమాల కంటే డిఫరెంట్ సినిమాని చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తనకు కీలకంగా మారడమే కాకుండా తనని ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ లో నిలబెడుతుంది అనేది డిసైడ్ చేసే సినిమా కూడా ఇదే కావడం విశేషం…ఇక దీని కోసమే ఆయన అనుక్షణం తపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ జరగాల్సి ఉంది.

కానీ అనుకోని కారణాల వల్ల ఆ షెడ్యూల్ అయితే పోస్ట్ పోన్ చేశారట. ఇక దానికి కారణం ఏంటి అంటే ఒక ఇంటి సెటప్ లో షెడ్యూల్ ని ప్లాన్ చేసిన శేఖర్ కమ్ముల ఆ ఇల్లు సెట్ అనుకున్నట్టుగా రాలేదట… ఇక దానివల్లే ఈ షెడ్యూల్ ని క్యాన్సల్ చేసి మళ్ళీ ఆ ఇంటి సెట్ ని సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆర్ట్ డైరెక్టర్ తను చెప్పిన విధానం లో సెట్ వెయ్యకపోవడమే దానికి కారణం అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో శేఖర్ కమ్ముల అన్ని రకాలుగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగకూడదనే ఉద్దేశ్యంతోనే అటు కథపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఇక ఇటు మేకింగ్ పరంగా కూడా ఆయన దగ్గరుండి మరి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ధనుష్ కి కూడా మంచి బ్రేక్ లభిస్తుందని ఆయన్ భావిస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే తెలుగులో ఆయనకు భారీ మార్కెట్ క్రియేట్ అవ్వడానికి ఈ సినిమా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక రీసెంట్ గా వచ్చిన రాయన్ సినిమాతో భారీగా ఢీలా పడిన ధనుష్ తెలుగు మార్కెట్ భారీ గా తగ్గిపోయిందనే చెప్పాలి. ఆయనకు తెలుగులో ఒక సక్సెస్ వస్తే వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు రావడంతో స్టార్ హీరోగా తన మనుగడను కొనసాగించలేకపోతున్నాడు. మరి ఈ సినిమాతో అయిన ధనుష్ కి తెలుగులో ఎవర్ గ్రీన్ హీరో మంచి గుర్తింపు లభిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…