https://oktelugu.com/

Srileela : శ్రీలీల చివరి తెలుగు సినిమా అదేనా..? ఒక్క ఫ్లాపుతో షాకింగ్ నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్!

బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ రాక, టాలీవుడ్ లో కూడా అవకాశాలు కోల్పోయి కెరీర్స్ ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు శ్రీలీల పరిస్థితి కూడా అలాగే అవ్వనుందా?, లేదా శ్రీదేవి లాగా సక్సెస్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.

Written By:
  • NARESH
  • , Updated On : August 17, 2024 / 09:24 PM IST

    srileela2

    Follow us on

    Srileela : టాలీవుడ్ లో ఒక హీరోయిన్ మనుగడ సాగించాలంటే చాలా కష్టం, అదృష్టం బోలెడంత ఉండాలి. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంటారు. ఆ క్రేజ్ ద్వారా వరుసగా సినిమా ఆఫర్స్ ని పొందుతారు. కానీ రెండు మూడు ఫ్లాప్స్ రాగానే ఎంత స్పీడ్ గా పైకి ఎదిగారో, అంతే స్పీడ్ గా క్రిందకి పడిపోతారు. అలాంటి హీరోయిన్స్ లో మనం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి చెప్పుకోవచ్చు. ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ, ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలతో సూపర్ హిట్స్ ని అందుకుంది.

    ఇక స్టార్ గా తన కెరీర్ ని పదిలం చేసుకుంది అని అనుకుంటున్న సమయంలో ఆమెకు వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. దీంతో ఎంత వేగంగా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకుపోయిందో,అంతే వేగంగా క్రిందకి పడిపోయింది. ఇప్పుడు ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పుడు శ్రీలీల పరిస్థితి కూడా అలాగే తయారు అయ్యేట్టు ఉంది. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హాట్ బ్యూటీ, మొదటి సినిమాతోనే కోట్లాది మంది తెలుగు ప్రజలకు కనెక్ట్ అయ్యింది. యూత్, మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. పెళ్లి సందడి చిత్రం తర్వాత ఆమె చేసిన ‘ధమాకా’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. ఎడాపెడా సినిమాలు చేసేసింది. స్క్రిప్ట్ ని కూడా సరిగా వినకుండా ఆమె సినిమాలను ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ధమాకా తర్వాత ‘భగవంత్ కేసరి’ చిత్రం తప్ప ఆమె కెరీర్ లో మరో హిట్ లేదు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి చేసిన ‘గుంటూరు కారం’ చిత్రం కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇది ఆమె కెరీర్ మీద బలమైన ఎఫెక్ట్ పడింది. అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

    ప్రస్తుతం ఆమె చేతిలో నితిన్ ‘రాబిన్ హుడ్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె టాలీవుడ్ కి శాశ్వతంగా దూరమై, బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుంది అంటూ లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాల్లో ఆమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం. చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ రాక, టాలీవుడ్ లో కూడా అవకాశాలు కోల్పోయి కెరీర్స్ ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు శ్రీలీల పరిస్థితి కూడా అలాగే అవ్వనుందా?, లేదా శ్రీదేవి లాగా సక్సెస్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.